-సీఎం చంద్రబాబు నాయకత్వంలో కమర్షియల్ వాహనాల నమోదులో గణనీయ వృద్ధి చోటు చేసుకుందని మంత్రి వివరణ.
-చంద్రబాబు దిశానిర్దేశంతో ఈవీ రంగంలో సానుకూల మార్పులు
-ప్రభుత్వ ప్రోత్సాహక విధానాలతో పెరిగిన ఈవీ వాహనాల నమోదు… రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో ఈ వివాహనాల నమోదు సంఖ్య గణనాయక పెరగడంపై సీఎం చంద్రబాబు నాయుడు మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డిని అడగగా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సీఎం చంద్రబాబు నాయుడు కి వివరణ ఇచ్చారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం, దూరదృష్టితో అమలవుతున్న విధానాల ఫలితంగా రాష్ట్రంలో కమర్షియల్ వాహనాల నమోదులో గణనీయమైన వృద్ధి నమోదైందని, నెలవారీ ఆర్థిక నివేదిక ప్రకారం, ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో కొత్త కమర్షియల్ వాహనాల నమోదు 33,234 నుంచి 44,212కు పెరిగిందని తెలిపారు.
ఈ వృద్ధికి ఎలక్ట్రిక్ వాహనాల (EV) కొనుగోళ్లు పెరగడం ప్రధాన కారణంగా నిలిచి, డీజిల్, పెట్రోల్ ధరల్లో హెచ్చుతగ్గులు, ప్రభుత్వం ఈవీలకు అందిస్తున్న ప్రోత్సాహకాలు, పర్యావరణహిత రవాణాపై ప్రజల్లో పెరుగుతున్న అవగాహనతో ఎలక్ట్రిక్ వాహనాలకు ఆదరణ పెరిగింది.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమర్థ నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజాహిత, అభివృద్ధి కార్యక్రమాల ఫలితంగానే ఈ సానుకూల మార్పు సాధ్యమైందని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా ఈవీ రంగానికి మరింత ప్రోత్సాహం అందించి రాష్ట్రాన్ని సుస్థిర రవాణా దిశగా ముందుకు తీసుకెళ్తామని మంత్రి తెలిపారు.
Prajavartha Online Telugu News