విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ–2026 కార్యక్రమంలో భాగంగా విజయవాడ నగరంలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ, డిజిటలైజేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది.
జూలై 11వ తేదీ సాయంత్రం 4.00 గంటల నాటికి 80-విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో మొత్తం 2,77,822 మంది ఓటర్లలో 2,77,065 మందికి (99.73%) ఎన్యుమరేషన్ ఫారాలు పంపిణీ చేయగా, 2,17,887 ఫారాలు (78.43%) డిజిటలైజ్ చేయబడ్డాయి.
81-విజయవాడ తూర్పు నియోజకవర్గంలో మొత్తం 2,69,734 మంది ఓటర్లలో 2,68,889 మందికి (99.69%) ఎన్యుమరేషన్ ఫారాలు పంపిణీ చేయగా, 2,14,234 ఫారాలు (79.42%) డిజిటలైజ్ చేయబడ్డాయి.
79-విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో మొత్తం 2,56,980 మంది ఓటర్లలో 2,56,699 మందికి (99.89%) ఎన్యుమరేషన్ ఫారాలు పంపిణీ చేయగా, 1,98,197 ఫారాలు (77.12%) డిజిటలైజ్ చేయబడ్డాయి.
పంపిణీ చేసిన ఎన్యుమరేషన్ ఫారాలను త్వరితగతిన సేకరించి, భారత ఎన్నికల సంఘం నిర్దేశించిన గడువులోగా డిజిటలైజేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని అన్ని AEROలు, BLO సూపర్వైజర్లు, BLOలకు ఆదేశాలు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రతిరోజూ సాయంత్రం 4.00 గంటలకు నియోజకవర్గాల వారీగా పురోగతి వివరాలను విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.
Prajavartha Online Telugu News