ఘనంగా ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ వజ్రోత్సవ వేడుకలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ జోన్ పరిధిలోని ఆటోనగర్, గవర్నర్పేట 1 గవర్నర్పేట 2 డిపో నందు శనివారం ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ 75వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ జూలై 11 1952లో ఏర్పడి నేటికి 74 సంవత్సరాల పూర్తి చేసుకుని 75 వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా విజయవాడ జోన్వ్యాప్తంగా ఉన్న 31 డిపోలలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు* గవర్నర్పేట వన్ టూ డిపోల నందు రాష్ట్ర కార్యదర్శి ఎస్ ఎస్ నారాయణ విజయవాడ జోనల్ కార్యదర్శి వైయస్ రావు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మూడు డిపోల అధ్యక్ష కార్యదర్శులు గ్యారేజీ కార్యదర్శి కమిటీ సభ్యులు హాజరయ్యి పతాకావిష్కరణ చేసి కేక్ కట్ చేసి ఉద్యోగులకు శుభాకాంక్షలు తెలియజేశారు
ఈ సందర్భంగా విజయవాడ జోనల్ కార్యదర్శి వైయస్ రావు మాట్లాడుతూ 1952 నుండి ఏపీఎస్ఆర్టీసీ లో పనిచేస్తున్న ఉద్యోగులకు కావలసిన సౌకర్యాలను సాధించడంలో ఎంప్లాయిస్ యూనియన్ ముందుండి పోరాడి సాధించిందని తెలియజేశారు ఈరోజు 3 వేల కోట్లతో టర్నోవర్ చేస్తున్నటువంటి క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ ఏర్పాటుకు సొంత స్థలాన్ని సొసైటీకి ఇచ్చిన ఘనత ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ దే అని తెలియజేశారు మరియు ఆర్టీసీలో జరిగిన 14 పి ఆర్ సి లలో 9 పి ఆర్ సి లు చేసిన ఘనత కూడా ఎంప్లాయిస్ యూనియన్ కే దక్కిందని అలాగే బి డబ్ల్యు ఎస్ సాధన కాంట్రాక్ట్ కార్మికుల రెగ్యులరైజేషన్ ఎలవెన్సులు సాధన ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే విధంగా ఒత్తిడి చేయడంలో ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ పాత్ర ఘనమైనదని తెలియజేశారు భవిష్యత్తులో కూడా ఏపీఎస్ఆర్టీసీని రక్షించుకునేందుకు ఈ యొక్క సంస్థ ద్వారా ప్రజలకు మరిన్ని సేవలు అందించేందుకు గాను ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ కట్టుబడి ఉందని తెలియజేశారు జోన్ వ్యాప్తంగా కాకినాడ రాజమండ్రి అమలాపురం ఏలూరు భీమవరం మచిలీపట్నం డిపోలలో జోన్ ప్రధాన నాయకత్వం వేడుకలకు హాజరై ఎంప్లాయిస్ యూనియన్ చరిత్రను ఉద్యోగులకు తెలియజేశారు ఈ సందర్భంగా జోన్ లో ఉన్న అందరూ ఆర్టీసీ ఉద్యోగులకు జోనల్ కార్యదర్శి వైయస్ రావు అలాగే జోనల్ అధ్యక్షులు గిడ్ల చిరంజీవి శుభాకాంక్షలు తెలియజేశారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మత్స్యకారుల సేవలో మరో కీలక నిర్ణయం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2026–27 సంవత్సరానికి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *