సోషల్ మీడియా దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తప్పవు

– రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోంది
– ప్రజల మధ్య విధ్వేషాలు సృష్టించడమే పనిగా జగన్ రెడ్డి వ్యవహరిస్తున్నాడు
– పెయిడ్ ఆర్టిస్టులతో మత విధ్వేషాలకు జగన్ రెడ్డి కుట్రలు చేస్తున్నాడు
– తప్పు చేస్తే ఎంతటివారినైనా ఉపేక్షించకుండా చట్టం తీసుకొస్తాం
– మచిలీపట్నంలో గ్రీవెన్స్ నిర్వహించి అర్జీలు స్వీకరించిన మంత్రి కొల్లు రవీంద్ర

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
సోషల్ మీడియాను అడ్డగోలుగా వాడుతూ ప్రజల మధ్య విధ్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నించే వారిపై కఠిన చర్యలు తీసుకునేలా త్వరలోనే చట్టాన్ని తీసుకొస్తామని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. మచిలీపట్నం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గ్రీవెన్స్ నిర్వహించి ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. పలు సమస్యలను అక్కడికక్కడే అధికారులతో మాట్లాడి పరిష్కరించారు. ప్రజలకు జవాబుదారీగా నిలవడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ప్రజాప్రతినిధులంతా వారంలో ఒక రోజు ప్రజల నుండి వినతులు స్వీకరించడం లక్ష్యంగా పార్టీ కార్యాలయంలో గ్రీవెన్స్ నిర్వహిస్తున్నాం. ఈ రోజు 30 అర్జీలు స్వీకరించాం. ఇప్పటి వరకు 464 అర్జీలు రాగా 357 అర్జీలు పరిష్కరించాం. కొన్ని అర్జీలను ఆయా శాఖలకు పంపించాం.

వైసీపీ ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో రెవెన్యూ వ్యవస్థ మొత్తాన్ని అస్తవ్యస్థం చేశారు. ఫలితంగా నేడు వేలాదిగా దరఖాస్తులు వస్తున్నాయి. గతంలో ప్రజల ఆస్తులకు చెందిన పాస్ పుస్తకాలు, భూమి సరిహద్దు రాళ్లపై జగన్ రెడ్డి ఫోటోలు వేసుకున్నాడు. జగన్ రెడ్డి ఫోటో వేసుకోవడానికి సుమారు రూ.700 కోట్ల ప్రజాధనాన్ని దోచిపెట్టాడు. కానీ నేడు రెవెన్యూ సమస్యలన్నింటినీ పరిష్కరించి ప్రజలకు వారి ఫోటో, ట్యాంపర్ చేయడానికి వీల్లేని క్యూఆర్ కోడ్, ప్రభుత్వ రాజముద్రతో కూడిన పాస్ పుస్తకాలు అందిస్తున్నాం.

కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో రాష్ట్రానికి వేల కోట్ల విలువైన పెట్టుబడులు వస్తున్నాయి. వందలాది పరిశ్రమలు ఏర్పాటవుతున్నాయి. లక్షలాది ఉద్యోగాలు లభిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ సహకారం, నిరంతరం కష్టబడే ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి, నారా లోకేశ్ చిత్తశుద్ధితో రాష్ట్రం అభివృద్ధి జరుగుతోంది. ఈ అభివృద్ధిని ఓర్వలేక గొడ్డలి పార్టీ నాయకులు రాష్ట్రంపై రోజుకో రకంగా విషం చిమ్ముతున్నారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తూ.. కులం, మతం, ప్రాంతాల మధ్య వైషమ్యాలు పెంచుతున్నారు. ప్రజల్ని రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలని ప్రయత్నిస్తున్నారు. గొడ్డలి పార్టీని వైఖరిని గుర్తించి ప్రజలు 151 సీట్ల నుండి 11 సీట్లకు పరిమితం చేసినా.. బుద్ధి రాలేదు. ఓట్లేసి గెలిపించిన వ్యక్తులు అసెంబ్లీకి కూడా రాకుండా ప్రజాతీర్పును అవహేళన చేస్తున్నారు. పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్న జగన్ రెడ్డి.. ఎంత సేపూ రాష్ట్రంలో అలజడులు సృష్టించాలనే ఆలోచన తప్ప అభివృద్ధి గురించి ఆలోచించడం లేదు.

గతంలో అమలాపురంలో రెండు కులాల మధ్య చిచ్చు పెట్టి లబ్ది పొందేందుకు కొన్ని ఇళ్లను తగలబెట్టేశారు. ఇప్పుడు కొంత మంది పెయిడ్ ఆర్టిస్టులతో ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నాడు. పేటీఎం కూలీలతో ప్రభుత్వ పెద్దల కుటుంబ సభ్యులపై తప్పుడు వ్యాఖ్యలు చేయిస్తున్నాడు. మతం పేరుతో రాజకీయంచేస్తున్నాడు. జగన్ రెడ్డి బయటకు రామరాజ్యం అంటాడు.. వెనుక నుండి రాముడి గురించి తప్పుడు కూతలు కూసిన వారిని వెనకేసుకొస్తున్నాడు. జగన్ రెడ్డి ద్వంద్వ వైఖరి పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే వ్యక్తులకు ఈ ప్రజాస్వామ్యంలో ఉండే అర్హత లేదు. జగన్ రెడ్డి లాంటి దుర్మార్గులు ఈ సమాజానికి అత్యంత ప్రమాదకరం. సోషల్ మీడియాలో తప్పుడు కూతలు కూసే ఎవరికైనా తగిన గుణపాఠం చెబుతాం. మన రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛను కుట్రలు చేయడానికి వాడుకుంటే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మత్స్యకారుల సేవలో మరో కీలక నిర్ణయం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2026–27 సంవత్సరానికి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *