గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (సర్) ప్రక్రియకు 2 రోజులే గడువు ఉందని, ఎన్యూమరేషన్ ఫారాలుఇంకా ఎవరైనా ఇవ్వకుంటే తక్షణం ఇవ్వాలని, లేకుంటే ఈ నెల 21న వచ్చే ముసాయిదా ఓటర్ల జాబితాలో ఓటు ఉండకపోవచ్చని నగర కమిషనర్, తూర్పు నియోజకవర్గ ఈఆర్ఓ కె.మయూర్ అశోక్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఎన్యూమరేషన్ ఫారాలు అందుకున్న ఓటర్లు వాటిని నింపి, వెంటనే బిఎల్ఓలకు ఇచ్చి సహకరించాలని కోరారు. ఆదివారం నాటికి గుంటూరు తూర్పు నియోజకవర్గంలో మొత్తం 2,52,062 ఓటర్లకు గాను 2,51,957 ఫారాలను (99.96 శాతం) పంపిణీ చేసి, అందులో 1,88,435 ఫారాలను (74.76శాతం) డిజిటైజ్డ్ చేశామని వివరించారు. అలాగే గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో మొత్తం 2,78,555 ఓటర్లకు గాను 2,78,264 ఫారాలను (99.90 శాతం) పంపిణీ పూర్తి చేసి, వాటిలో 2,00,554 ఫారాలను (72 శాతం) డిజిటైజ్డ్ ప్రక్రియను పూర్తి చేసినట్లు పేర్కొన్నారు.
Prajavartha Online Telugu News