మరో రెండురోజులే సర్..!

-ఇంకా ఎవరైనా ఫారాలు సమర్పించుకుంటే వెంటనే బీఎల్వోకు అందజేయాలి
-క్షేత్ర స్థాయిలో ఓటర్ల సేవలోనే అధికారులు
-వారి సహాయ సహకారాలను తీసుకొని కార్యక్రమాన్ని విజయవంతం చేయండి
-జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ ఆదేశం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంలో భాగంగా ఎన్యూమరేషన్ ఫారాల సమర్పణకు మరో రెండురోజులు మాత్రమే గడువు మిగిలి ఉన్నందున, ఇంకా ఫారాలు సమర్పించని ఓటర్లు వెంటనే తమ పరిధిలోని బూత్ స్థాయి అధికారి (బీఎల్వో)కు ఫారాలు అందజేయాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ పిలుపునిచ్చారు.
ఫారాల స్వీకరణకు ఈ నెల 14వ తేదీ చివరి గడువు కావడంతో ప్రతి ఓటర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఫారాలు సమర్పించడంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా బీఎల్వోలు, ప్రత్యేక శిబిరాలు, హెల్ప్ డెస్కులను సంప్రదించాలని తెలిపారు.
ఓటర్లకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు క్షేత్రస్థాయిలో అధికారులు, బీఎల్వోలు నిరంతరం అందుబాటులో ఉన్నారని కలెక్టర్ తెలిపారు. ప్రతి పోలింగ్ కేంద్రం పరిధిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరాలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని, ఓటర్లు వాటి సేవలను వినియోగించుకోవాలని కోరారు. ఇంకా ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించని కుటుంబ సభ్యులు, బంధువులు, పొరుగువారికి కూడా సమాచారం అందించి, గడువు తేదీలోగా ఫారాలు సమర్పించేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజల సహకారంతో ఎస్‌ఐఆర్ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఓటర్ల ఓటు భద్రతకు భరోసా కల్పించడం లక్ష్యమని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ పేర్కొన్నారు.
అధికారులతో కలెక్టర్ టెలీ కాన్ఫరెన్స్:
ఆదివారం ఈఆర్వోలు, ఏఈఆర్వోలు, ప్రత్యేక అధికారులతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. మిగిలిన రెండు రోజులు ఎస్‌ఐఆర్ ప్రక్రియలో అత్యంత కీలకమైనవని, క్షేత్రస్థాయిలో అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఎన్యూమరేషన్ ఫారాల డిజిటైజేషన్‌లో పెండింగ్‌లో ఉన్న పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి నిర్దేశిత లక్ష్యాలను సాధించాలని ఆదేశించారు. బూత్ స్థాయి అధికారులు (బీఎల్వోలు), బూత్ స్థాయి ఏజెంట్లు (బీఎల్ఏలు)తో తప్పనిసరిగా సమావేశాలు నిర్వహించి ఎస్‌ఐఆర్ ప్రక్రియ పురోగతిని వివరించడంతో పాటు వారి సందేహాలను నివృత్తి చేయాలని సూచించారు.
క్షేత్రస్థాయిలో అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి ఓటర్లకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని, ప్రతి పోలింగ్ కేంద్రం పరిధిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరాలు, హెల్ప్ డెస్కులు సమర్థవంతంగా పనిచేసేలా పర్యవేక్షించాలని కలెక్టర్ ఆదేశించారు.
89.95 శాతం డిజిటైజేషన్:
జిల్లాలో సర్ ప్రక్రియలో భాగంగా ఎన్యూమ‌రేష‌న్ ఫారాల డిజిటైజేష‌న్ సజావుగా సాగుతోంది. 15,41,222 (89.95 శాతం) ఎన్యూమ‌రేష‌న్ ఫారాల డిజిటైజేష‌న్ పూర్త‌యింది. తిరువూరు నియోజ‌క‌వ‌ర్గంలో 1,95,464 (93.65 శాతం), విజ‌య‌వాడ ప‌శ్చిమ 2,30,677 (89.76 శాతం), విజ‌య‌వాడ మ‌ధ్య 2,40,082 (86.42 శాతం), విజ‌య‌వాడ తూర్పు 2,37,936 (88.21 శాతం), మైల‌వ‌రం 2,57,912 (90.44 శాతం), నందిగామ 1,89,343 (91.26 శాతం), జ‌గ్గ‌య్య‌పేట 1,89,808 (91.45 శాతం) ఫారాల డిజిటైజేష‌న్ పూర్త‌యింది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మత్స్యకారుల సేవలో మరో కీలక నిర్ణయం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2026–27 సంవత్సరానికి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *