విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సి.ఆర్.మీడియా అకాడమీ అక్కౌంట్స్ అధికారి గా పి. కరుణామయి సోమవారం పదవీ బాధ్యతులు స్వీకరించారు. ట్రెజరీస్ అండ్ అక్కౌంట్స్ శాఖ కు చెందిన పి. కరుణామయి ఇటీవలే అక్కౌంట్స్ అధికారిగా పదోన్నతి పొందారు. అనంతరం ఆమెను సి.ఆర్. మీడియా అకాడమి కార్యాలయంలో అకౌంట్స్ అధికారిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తరువులను పురస్కరించుకుని స్థానిక మొఘల్ రాజ్ పురంలోని సి.ఆర్. మీడియా అకాడమి కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అంతకు ముందు అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేశ్ కుమార్, సెక్రెటరీ టి.కస్తూరి ని, మేనేజర్ భాస్కర నారాయణను మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. అకాడమీ కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేయడంలో తమ వంతు కృషి చేస్తానని ఆమె పేర్కొన్నారు.
Prajavartha Online Telugu News