అదనపు కమీషనర్ గా చేరిన ఐ. కిషోర్ ను కలిసిన ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్ అసోసియేషన్ సభ్యులు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ​
గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కు అదనపు కమీషనర్ గా నూతనంగా విధుల్లో చేరిన ఐ. కిషోర్ ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్ అసోసియేషన్ సభ్యులు సోమవారం ఆయన ఛాంబర్ లో కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు వారీ దృష్టికి తీసుకొని వెళ్ళగా, స్పందించిన అదనపు కమిషనర్ తన పరిధిలో లో ఉన్న ప్రతి ఒక్క ఉద్యోగి సమ‌స్యను పరిష్కరించుటకు కృషి చేయుట జరుగుతుందని ఉద్యోగ సంఘ నాయకులకు హామి ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ సర్వీసు అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాంద్ బాష మాట్లాడుతూ, ఉద్యోగుల సమస్యలపై పోరాడుతున్న సంఘాని గుర్తింపు ఇవ్వాలని మిడియా మిత్రులకు తెలిపారు.
ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా అధ్యక్షుడు ముజిబుర్ రెహమాన్, జిల్లా ఉపాధ్యక్షులు రాజు, సహాధ్యక్షులు బి. శ్రీనివాసరావు, నగర శాఖ సహ అధ్యక్షులు అబ్దుల్లా, జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి రవి, ఖజావలి, అన్వర్ బాషా, గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు భరత్ కుమార్, కార్యదర్శి హిదయతుల్లా తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మత్స్యకారుల సేవలో మరో కీలక నిర్ణయం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2026–27 సంవత్సరానికి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *