-తక్కువ రోజులు కావాలనుకునే వారికి అనుకూలం
-ఆప్షన్ ద్వారా షార్ట్ హజ్ ను సద్వినియోగం చేసుకోవాలి
-మైనారిటీ మంత్రి ఎన్ఎండి ఫరూక్ వెల్లడి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
పవిత్ర మక్కా హజ్ యాత్ర లో కుదిరించబడిన రోజులతో “షార్ట్” హజ్ యాత్ర సౌకర్యాన్ని కేంద్ర హజ్ కమిటీ కల్పించినట్లు మైనారిటీ, న్యాయ శాఖల మంత్రి ఎన్ఎండి ఫరూక్ వెల్లడించారు.తక్కువ రోజుల వ్యవధి తో హజ్ యాత్ర పూర్తి చేయాలనుకునే వారు ఆప్షన్ ఎంచుకోవడం ద్వారా అవకాశాన్ని పొందవచ్చని అమరావతిలో సోమవారం విడుదల చేసిన ప్రకటనలో మంత్రి పేర్కొన్నారు.హజ్ కమిటీ ఆఫ్ ఇండియా హజ్-2027లో దాదాపు 20 రోజులకు కుదించబడిన ప్రణాళికతో షార్ట్ హజ్ సౌకర్యం కూడా కల్పిస్తున్నదన్నారు.ఈ ప్యాకేజీలో మదీనాలో 2 లేదా 3 రోజుల బస కూడా చేర్చబడిందన్నారు. ప్రస్తుతం 35-45 రోజుల వ్యవధితో హజ్‌యాత్రకు,20 రోజులకు కుదిరించబడిన షార్ట్ హజ్ యాత్ర ప్యాకేజీ ధరల్లో ఎలాంటి వ్యత్యాసముండదని మంత్రి ఫరూక్ స్పష్టత ఇచ్చారు.2027 – హజ్ యాత్రలో దేశ వ్యాప్తంగా హజ్ కు వెళ్లే వారిలో గరిష్టంగా 10000 మందికి ఈ సౌకర్యం కల్పించేందుకు హజ్ కమిటీ ఆఫ్ ఇండియా నిర్ణయం తీసుకుందన్నారు. 20 రోజుల వ్యవధితో షార్ట్ హజ్ కోరుకునే వారు తమ హజ్ దరఖాస్తును ఆన్ లైన్ లో సమర్పించేటప్పుడు, అందులో ఇచ్చిన షార్ట్ హజ్ ప్యాకేజీ ఆప్షన్ ను ఎంచుకోవాల్సి ఉంటుందని తెలిపారు.ఆప్షన్ ఎంచుకోవడం ద్వారా షార్ట్ హజ్ ను పొందుపరిచిన అనంతరం, ఆన్ లైన్ లో దరఖాస్తు సమర్పించిన అనంతరం ప్యాకేజీ మార్చుకోవడానికి అవకాశం ఉండదని మంత్రి తెలిపారు.షార్ట్ హజ్ కు దరఖాస్తు చేసుకున్న యాత్రికులను లాటరీ విధానంలో ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. హజ్ కు ఎంపికై షార్ట్ హజ్ కు ఎంపిక కాని వారికి ఆటోమేటిక్ గా సాధారణ హజ్ పాకేజ్ (35-45 రోజులు) వర్తిస్తుందని తెలిపారు.ఒక కవర్ లోని యాత్రికులందరూ ఈ షార్ట్ హజ్ ఆప్షన్ ఎన్నుకోవలసి ఉంటుందన్నారు.ఒకే కవర్ లో రెండు ప్యాకేజీలు అనుమతించబడవని పేర్కొన్నారు.కాగా షార్ట్ హాజ్ యాత్ర ఢిల్లీ,ముంబై, బెంగళూరు,చెన్నై, హైదరాబాద్, కొచ్చిన్,కోల్ కతా,అహ్మదాబాద్ నుండి మాత్రమే నిర్వహించ బడుతుందన్నారు. హజ్ -2027 కోసం దరఖాస్తు చేసుకోవడానికి గడువు ఈ నెల 20 వ తేదీన ముగుస్తున్నందున, గడువుకు ముందుగానే ఆన్ లైన్ ద్వారా హాజీ లు తమ పూర్తి వివరాలతో దరఖాస్తు చేసుకోవాలని మంత్రి ఫరూక్ సూచించారు. 20 రోజులకు కుదిరించబడిన షార్ట్ హజ్ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మంత్రి హాజీ లను కోరారు. విజయవాడ ఎంబార్కేకేషన్ కేంద్రంను ఎంచుకొని గన్నవరం విమానాశ్రయం ద్వారా హజ్ యాత్ర కు వెళ్లే రాష్ట్రంలోని ప్రయాణికులందరికీ కూటమి ప్రభుత్వం అందించే రూ. లక్ష ఆర్థిక సహాయం పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని మైనారిటీ మంత్రి ఎన్ఎండి ఫరూక్ విజ్ఞప్తి చేశారు.
Prajavartha Online Telugu News