మత్స్యకారుల సేవలో మరో కీలక నిర్ణయం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2026–27 సంవత్సరానికి “మత్స్యకారుల సేవలో” (Marine Fishing Ban Relief) కార్యక్రమం కింద సముద్ర వేట నిషేధ కాల భృతి విడుదలకు సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వు (జీవో)ను సోమవారం విడుదల చేసింది. ఈ పథకం కింద మొదటి విడతలో 1,28,388 మంది మత్స్యకార కుటుంబాలకు రూ.256.776 కోట్లు విడుదల చేయగా, రెండో విడతలో సాంకేతిక, ఇతర కారణాల వలన మిగిలిన 5,910 మంది లబ్ధిదారులకు రూ.11.82 కోట్లు మంజూరు చేసింది. మొత్తంగా 1,34,298 మంది మత్స్యకార కుటుంబాలకు ఆర్థిక సహాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందనుంది. సముద్ర వేట నిషేధ కాలంలో ఉపాధి కోల్పోయే మత్స్యకార కుటుంబాలు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోకుండా వారికి అండగా నిలవాలనే ఉద్దేశంతో ఈ భృతిని ప్రభుత్వం అందిస్తోంది. మత్స్యకారుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, వారి జీవనోపాధి భద్రత కోసం తీసుకున్న మరో కీలక నిర్ణయంగా ఈ జీవో నిలుస్తుందని అధికారులు తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

హజ్ -2027 యాత్ర లో “షార్ట్” హజ్ సౌకర్యం

-తక్కువ రోజులు కావాలనుకునే వారికి అనుకూలం -ఆప్షన్ ద్వారా షార్ట్ హజ్ ను సద్వినియోగం చేసుకోవాలి -మైనారిటీ మంత్రి ఎన్ఎండి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *