Breaking News

పరిశ్రమల రాకతో స్థానికంగానే ఉద్యోగాలు

-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత
-సీఎం చంద్రబాబు కృషితో విస్తృతంగా పరిశ్రమల ఏర్పాటు
-విద్య పూర్తికాగానే నివాసమున్నచోటే ఉపాధి
-పరిశ్రమల రాకతో నిరుద్యోగ యువత వలసలకు బ్రేక్
-నీరా యూనిట్ల ఏర్పాటుతో వ్యాపారులుగా గీత కార్మికులు
-ఈడిగల ఉన్నతే సీఎం చంద్రబాబు లక్ష్యం
-హిందూపురం నందమూరి అడ్డా
-విద్యతోనే అందలం : మంత్రి సవిత
-ఈడిగ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల పంపిణీ

హిందూపురం/శ్రీసత్యసాయి, నేటి పత్రిక ప్రజావార్త :
ఉన్నత విద్య పూర్తి కాగానే స్థానికంగానే ఉద్యోగాలు లభించేలా కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున పరిశ్రమలు ఏర్పాటు చేస్తోందని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. బీసీ బిడ్డలు ఉన్నత స్థానాల్లో ఉండాలన్న సంకల్పంతో సివిల్ సర్వీసెస్, డిఎస్సీ వంటి పరీక్షలకు బీసీ స్టడీ సర్కిళ్ల ద్వారా ఉచిత శిక్షణ అందజేస్తున్నామన్నారు. ఈడిగలు, గౌడలను అన్నిరంగాల్లో రాణించేలా సీఎం చంద్రబాబునాయుడు అధిక ప్రాధాన్యమిస్తున్నారని, త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా నీరా యూనిట్లు స్థాపించనున్నారని తెలిపారు. శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలో ఆదివారం ఈడిగ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి సవిత పాల్గొని ప్రసంగించారు. గీత కార్మికుల సంక్షేమానికి ఆది నుంచి సీఎం చంద్రబాబునాయుడు ప్రాధాన్యమిస్తూ వస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే, మద్యం షాపుల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పించారన్నారు. మద్యం దుకాణాల లైసెన్స్ ఫీజులో 50 శాతం మేర రాయితీ ఇచ్చారన్నారు. 50 ఏళ్లు దాటిన గీత కార్మికులకు పింఛన్ అందజేసిన ఘనత కూడా సీఎం చంద్రబాబుదేనన్నారు. గీత కార్మికులను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా నీరా యూనిట్లు స్థాపించాలని సీఎం చంద్రబాబునాయుడు నిర్ణయించారని మంత్రి సవిత తెలిపారు.

నివాసం ఉన్న చోటే ఉద్యోగాలు

బీసీ బిడ్డలకు ఉన్నత విద్య అందించడంతో పాటు ఉన్నత స్థానాల్లో కూడా నిలవాలన్నది సీఎం చంద్రబాబు లక్ష్యమని మంత్రి సవిత తెలిపారు. ఇందుకోసం సివిల్ సర్వీసెస్, డీఎస్సీ, గ్రూప్ 2 సహా ఇతర పోటీ పరీక్షలకు బీసీ స్టడీ సర్కిళ్ల ద్వారా ఉచిత శిక్షణ అందజేస్తున్నట్లు తెలిపారు. ఉన్నత చదువులు చదివి పొట్టచేత పట్టుకుని నిరుద్యోగులు ఉద్యోగాలకు వలసలు వెళ్లే బాధలు తప్పేలా సీఎం చంద్రబాబు రేయింబవళ్లు కృషి చేస్తున్నారన్నారు. విద్యాభ్యాసం పూర్తి కాగానే, స్థానికంగా ఉద్యోగాలు లభించేటట్లు రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా పరిశ్రమలు నెలకొల్పుతున్నారని మంత్రి సవిత వెల్లడించారు.

హిందూపురం నందమూరి అడ్డా…

హిందూపురం నియోజక వర్గం నందమూరి వంశీయులకు అడ్డాగా మారిందని మంత్రి సవిత అన్నారు. ఆనాడు అన్న ఎన్టీఆర్… నేడు లెజండరీ నటుడు నందమూరి బాలకృష్ణకు హిందూపురం ఆదరిస్తూ వస్తోందన్నారు. హిందూపురం అభివృద్ధి ఎమ్మెల్యే బాలకృష్ణ అవిరళ కృషి చేస్తున్నారన్నారు. నియోజక వర్గంలో పరిశ్రమల స్థాపనతో పాటు మౌలిక సదుపాయలను కూడా పెద్ద ఎత్తున కల్పిస్తున్నారని మంత్రి సవిత తెలిపారు.

విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు

టెన్త్, ఇంటర్ లో అత్యుత్తమ మార్కులు సాధించిన ఈడిగ సామాజిక వర్గానికి చెందిన విద్యార్థులకు మంత్రి సవిత చేతుల మీదుగా ప్రతిభా పురస్కారాలు అందజేశారు. ఇంటర్ లో 80 శాతం మార్కులుపై పైబడిన సాధించిన ఈడిగ విద్యార్థులకు రూ.10 వేలు, 80 శాతం కంటే తక్కువ వచ్చిన విద్యార్థులకు రూ.8 వేల చొప్పున అందజేశారు. ఇంటర్ లో తొలి మూడు స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు ల్యాప్ ట్యాప్ లను మంత్రి సవిత అందజేశారు. టెన్త్ లో 80 శాతం మార్కులు సాధించిన ఈడిగ విద్యార్థులకు రూ.5 వేల చొప్పున అందజేశారు. తొలి మూడు స్థానాల్లో నిలిచిన ముగ్గురు విద్యార్థులకు రూ.15 వేల చొప్పున అందజేశారు. 80 శాతం కంటే తక్కువ వచ్చిన విద్యార్థులకు రూ.3 వేల చొప్పున అందజేశారు. ప్రతిభా పురస్కారాలు అందజేసిన ఈడిగ సామాజిక సంక్షేమ సంఘ ప్రతినిధులను మంత్రి సవిత అభినందించారు. విద్యార్థులు విద్య పట్ల పూర్తి స్థాయి దృష్టి సారించాలని, తల్లిదండ్రుల ఆశలు నెరవేరుస్తూ అనుకున్న లక్ష్యాలకు చేరాలని మంత్రి సవిత ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కేఈ ప్రభాకర్, గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి వెంకట గురుమూర్తి, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కిరణ్ కుమార్ హరికృష్ణ, గోపాల్, మాజీ జడ్పీటీసీ చిన్నప్పయ్య గౌడ్, అధిక సంఖ్యలో ఈడీగ సామాజిక వర్గీయులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఎన్.ఐ.డి. ప్రాంగణంలో 12వ జాతీయ చేనేత దినోత్సవ ముందస్తు వేడుకలు

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి సమీపంలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (NID) ప్రాంగణంలో 12వ జాతీయ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *