రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పుగోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరం అర్బన్ పరిధిలో ఉన్న ఎనిమిది ప్రభుత్వ వసతి గృహాల్లో విద్యార్థులకు ప్రభుత్వం మంజూరు చేసిన నిత్యావసర మెటీరియల్ పంపిణీ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఇందులో భాగంగా రాజమహేంద్రవరం బాలుర వసతి గృహం నెం.1లో విద్యార్థులకు ట్రంకు బాక్సులు, దుప్పట్లు, బ్లాంకెట్లు, ప్లేట్లు, కటోరాలు, గ్లాసులు, స్వెటర్లు, నైట్ డ్రెస్సులు, టర్కీ టవల్స్ తదితర వస్తువులను అందజేశారు
ఈ సందర్భంగా జిల్లా సాంఘిక సంక్షేమ సాధికారిత అధికారి ఎం.డి. గాయాజుద్దీన్ మాట్లాడుతూ, ప్రభుత్వం వసతి గృహ విద్యార్థులకు అందిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని విద్యార్థులు విద్యలో రాణించాలని సూచించారు. చదువును జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకునే సాధనంగా భావించి లక్ష్యసాధన దిశగా కృషి చేయాలని తెలిపారు. ప్రభుత్వం, దాతలు అందిస్తున్న సదుపాయాలను బాధ్యతగా వినియోగించుకోవాలని విద్యార్థులకు సూచించారు.
కార్యక్రమంలో విద్యార్థులకు వసతి గృహాల్లో కల్పిస్తున్న సౌకర్యాలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. విద్యార్థుల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపడుతున్న చర్యలను వివరించారు.
ఈ కార్యక్రమంలో కాశీ నవీన్, చేపల చినరాజు, తల్లిదండ్రులు, స్థానిక సంక్షేమ అధికారులు, వసతి గృహ సంక్షేమ అధికారులు, సహాయ సాంఘిక సంక్షేమ అధికారులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News