Breaking News

మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి పనుల పై అధికారులతో సమీక్షా సమావేశం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరంలో వాహనదారుల భద్రతకు, ప్రయాణ సౌకర్యానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ రోడ్లపై ఉన్న గుంతలను (పోట్ హోల్స్) రాబోయే రెండు రోజుల్లోగా పూర్తిగా పూడ్చివేయాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఇంజనీరింగ్ అధికారులకు స్పష్టం చేశారు. సోమవారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ సమావేశ మందిరంలో మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి పనుల వేగవంతం, రెవెన్యూ కలెక్షన్ పై అధికారులతో సమీక్షా సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, రోడ్లపై గోతులను యుద్దప్రాతిపదికన పూడ్చివేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. రోడ్ల మరమ్మతుల కోసం పోట్ హోల్స్ పూడ్చే మెషిన్ నిరంతరం రన్నింగ్‌లో ఉండేలా చూడాలని, రాబోయే వారం రోజులకు సంబంధించి స్పష్టమైన యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకోవాలన్నారు. ముఖ్యంగా జంక్షన్లు, లో-లెవల్ ప్రాంతాలు మరియు హైవేలను అనుసంధానించే రోడ్లపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. అలాగే మేజర్ డ్రైన్లలో కాంట్రాక్టర్ మెయింటెనెన్స్ గ్యారెంటీ ఉన్నందున మరలా పూడికతీత పనులు చేపట్టాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తున్న భవన నిర్మాణ వ్యర్థాలను భవన నిర్మాణదారులే రోడ్లపై నుండి తక్షణమే తొలగించేలా, ఎవరైనా రోడ్లపై వ్యర్ధాలు వేస్తె భారీ అపరాధ రుసుం విధించాలని పట్టణ ప్రణాళిక అధికారులను ఆదేశించారు. నగరంలో తాగునీటి సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకూడదని, ఎక్కడైనా లీకేజీలు ఉంటే వెంటనే అరికట్టాలన్నారు. వాటర్ మీటర్ రీడింగ్‌ ప్రక్రియను సంబంధిత డీఈఈలు స్వయంగా పర్యవేక్షించాలని, రీడింగ్‌ను ప్రతి నెల మూడో వారంలో ఖచ్చితంగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సమస్యలపై వచ్చే ప్రజల ఫిర్యాదులను అత్యంత వేగంగా పరిష్కరించాలని, డ్రైనేజీ ఛానల్స్‌లో పేరుకుపోయిన పూడికను నిరంతరం తొలగించాలని ఆదేశించారు. పౌర సేవలకు సంబంధించి నిర్దేశిత గడువు దాటి ఏ ఒక్క అప్లికేషన్ కూడా పెండింగ్‌లో ఉండటానికి వీల్లేదన్నారు. మరోవైపు ప్రస్తుతం నగరపాలక సంస్థలో రెవెన్యూ కలెక్షన్ మందగించడంపై కమిషనర్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ వసూళ్లను ముమ్మరం చేయాలని ఆదేశించారు. కేవలం సాధారణ ప్రజలే కాకుండా, నగరంలోని వివిధ రాష్ట్ర ప్రభుత్వ శాఖలు చెల్లించాల్సిన మున్సిపల్ పన్నులు, బకాయిలను కూడా ఖచ్చితంగా వసూలు చేసేలా చర్యలు తీసుకోవాలని, అలాగే ఖాళీ స్థలాల పన్ను వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. నగరంలో ప్రస్తుతం రన్నింగ్‌లో ఉన్న వివిధ అభివృద్ధి పనుల ప్రస్తుత స్థితిపై తాజా నివేదికను తక్షణమే అందించాలని ఎస్ఈని ఆదేశించారు.
సమావేశంలో నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ కిషోర్, ఎస్ఈ సుందర్రామిరెడ్డి, డిసిపి సూరజ్ కుమార్, ఆర్ఓలు, ఈఈలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఎన్.ఐ.డి. ప్రాంగణంలో 12వ జాతీయ చేనేత దినోత్సవ ముందస్తు వేడుకలు

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి సమీపంలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (NID) ప్రాంగణంలో 12వ జాతీయ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *