-జిల్లా ఇంచార్జి మంత్రి కొలుసు పార్థసారథి
బాపట్ల, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రత్యేక అవసరాలున్న పిల్లలకు మరింత మెరుగైన జీవితాన్ని అందించడానికి అధికారులు సమన్వయంతో పని చేయాలని జిల్లా ఇంచార్జి మంత్రి మరియు రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు.
సోమవారం మున్సిపల్ హై స్కూల్ ఆవరణలో ఉన్న భవిత కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్,వి., స్థానిక ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు, రాష్ట్ర అగ్ని క్షత్రియ సంక్షేమ చైర్మన్ సి పాపారావు, బావుడా చైర్మన్ రాజశేఖర్ బాబు తో కలసి జిల్లా ఇంచార్జి మంత్రి మరియు రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి సందర్శించి పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రత్యేక అవసరాలున్న పిల్లలకు మరింత మెరుగైన జీవితాన్ని అందించడానికి అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. భవిత కేంద్రాల బలోపేతానికి చర్యలు సమగ్ర విద్యతో ప్రతి చిన్నారికి విద్య బుద్ధులు అభివృద్ధే లక్ష్యంగా అధికారులు పని చేయాలన్నారు.ప్రతి చిన్నారికి సమాన విద్య అవకాశాలు కల్పించేయాలన్నదే కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల ముఖ్య ఉద్దేశమన్నారు. మానసికంగా,బుద్ధి మాంద్యం పిల్లల ప్రత్యేక అవసరాలున్న విద్యార్థుల భవిష్యత్తును మెరుగుపరిచేందుకు భవిత సహాయక కేంద్రాలు ఏర్పాటు చేసి, శిక్షణ పొందిన ఉపాధ్యాయులను నియమించడం జరిగిందని తెలిపారు. ప్రస్తుతం 17 మంది విద్యార్థులు శిక్షణ పొందుతున్నారని తెలిపారు.
భవిత కార్యక్రమంలోని 21 విభాగాలకు అనుగుణంగా సేవలు అందించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ మంత్రికి వివరించారు.
భవిత కేంద్రంలోని శిక్షణ పొందుతున్న మానసిక బుద్ధి మద్యం పిల్లల తల్లులతో మంత్రి మాట్లాడుతూ ఇక్కడ మీ పిల్లలకు అవసరమైన ఏర్పాట్లను బాగున్నాయని గతంలో మీ పిల్లలను ఎక్కడ ఉంచేవారని, ఈ భవిత కేంద్రం ద్వారా మీ పిల్లలకు అన్ని సౌకర్యాలు అందుతున్నాయని మీ పిల్లలు భవిష్యత్తు ఎలా ఉండాలని, మీరు కోరుకుంటున్నారని, తల్లుల ను అడిగి మంత్రి తెలుసుకున్నారు. కొందరు తమ పిల్లలు మానసిక స్థితి నుండి మామూలు చితికి వచ్చేలా ఇక్కడ విద్యాబుద్ధులు నేర్పించడానికి చర్యలు తీసుకోవాలని, పిల్లలు వారి పనులు వారే చేసుకునే విధంగా శిక్షణ ఇవ్వాలని, పిల్లల భద్రత కూడా కల్పించాలని, ఈ భవిత కేంద్రం మా పిల్లలకు చాలా ఉపయోగారంగా ఉందని వారు మంత్రికి వివరించారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీ ఓ. ఏ.హరి కుమార్, డి ఈ ఓ.శ్రీనివాస్ సింగ్, డి ఈ ఈ నాగజ్యోతి, తహశీల్దార్ షేక్ సలీమ,పిల్ల తల్లులు భవిత కేంద్రం ఇంచార్జి జ్యోస్నా తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News