విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎలక్ట్రానిక్ పరికరాలు సమాజగతిని మారుస్తున్నాయని, రాబోయే రోజుల్లో మన బట్టలే మొబైల్ చార్జింగ్ చేస్తాయని, క్షణాల్లో సుగర్ లెవెల్స్ మన కళ్ళముందే కనబడతాయని కె.ఎల్. డీమ్డ్ వర్సిటీ డీన్ డాక్టర్ బి.టి.పి. మాధవ్ అన్నారు. విజయవాడ పి.బి. సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఎలక్ట్రానిక్స్ విభాగం ఫ్లెక్సిబుల్ అండ్ ప్రింటెడ్ ఎలక్ట్రానిక్స్ పై ఎ.ఐ. టూల్స్ ప్రభావం గురించి గురువారం వెబినార్ హాలులో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ స్నాప్ మేజిక్ లాంటి ఏఐ కోపైలట్ టూల్స్ త్వరితగతిన సర్క్యూట్ లేఅవుట్, కాంపోనెంట్లను సరిదిద్దడానికి ఉపయోగపడతాయని, ముద్రణా యంత్రాల లోపాలను ముందే పసిగట్టడానికి మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్స్ వాడుతున్నారని, టెన్సర్ ఫ్లో, పై టార్చ్ మొదలైన కృత్రిమ మేధ పరికరాల రాకతో, నూతన సాంకేతికతతో ఎలక్ట్రానిక్స్ రంగం రూపురేఖలు మారిపోతున్నాయని చెప్పారు. ప్రిన్సిపాల్ డా. మేకా రమేశ్, డీన్ ఆచార్య రాజేశ్ సి. జంపాల, డైరెక్టర్ వేమూరి బాబూరావు, ఎలక్ట్రానిక్స్ విభాగాధిపతి కె. సాంబశివరావు, అధ్యాపకులు జి.నాగరాజు, డి.శ్రీనివాసరెడ్డి, జి.నాగశశాంక ముఖ్య అతిథిని ఈ సందర్భంగా సత్కరించారు.
Prajavartha Online Telugu News