విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలపై దాడులు పెరిగిపోయాయని, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని, సామాన్య మానవుడు సమాజంలో బ్రతకగలిగే అవకాశం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు కొమ్మూరి కనకారావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర SEC మెంబర్ జాన్ కెనడి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. టిడిపి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ నుండి విజయవాడ టిడిపి ఎస్సీ సెల్ సోంగా సంజయ్ వర్మ వరకు మహిళలపై లైంగిక దాడులకు పాల్పడుతూ నిత్యం వార్తల్లోకి ఎక్కడ మనం చూస్తూనే ఉన్నామని, ప్రజాక్షేత్రంలో ప్రజలు అన్నింటినీ గమనిస్తూనే ఉన్నారని అన్నారు. అభివృద్ధి చేస్తానన్న చంద్రబాబు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దుశ్చర్యలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు
వైఎస్ఆర్సిపి ఎన్టీఆర్ జిల్లా కార్యాలయం నందు ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు కొమ్మూరి కనకారావు,వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర SEC మెంబర్ జాన్ కెనడి మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలపై దాడులు పెరిగిపోయాయని, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని, సామాన్య మానవుడు సమాజంలో బ్రతకగలిగే అవకాశం లేదని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. టిడిపి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ నుండి విజయవాడ టిడిపి ఎస్సీ సెల్ సోంగా సంజయ్ వర్మ వరకు మహిళలపై లైంగిక దాడులకు పాల్పడుతూ నిత్యం వార్తల్లోకి ఎక్కడ మనం చూస్తూనే ఉన్నామని, ప్రజాక్షేత్రంలో ప్రజలు అన్నింటినీ గమనిస్తూనే ఉన్నారని అన్నారు. అభివృద్ధి చేస్తానన్న విజన్కలిగిన నాయకుడు చంద్రబాబు హయాంలో ఇటువంటి దుశ్చర్యలు జరుగుతూ ఉంటే ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టించుకోక పోవడం దురదృష్టకరమన్నారు. రాష్ట్రంలో రాజకీయ కక్షలే ధ్యేయంగా కూటమి ప్రభుత్వ నడుస్తుందని ఆగ్రహించారు. ఈ కార్యక్రమంలో ఎం ప్రకాష్ ఎన్టీఆర్ కృష్ణ డిస్ట్రిక్ట్ ఎస్సీ సెల్ అబ్జర్వర్,, పి శరత్ ఇండియా జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు, జి శ్యాంబాబు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఎస్సీ సెల్ అధ్యక్షుడు, మేదర సురేష్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, పి చంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి. కే జోజి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎస్సీ సెల్ సెక్రెటరీ, ప్రేమ్ స్టేట్ ప్రచార కమిటీ జనరల్ సెక్రటరీ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News