Breaking News

విజయవాడ , పశ్చిమలో బీజేపీ సంస్థాగత సమావేశం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
భారతీయ జనతా పార్టీ సంస్థాగత సమావేశం గురువారం భవానిపురం, ఆర్టీసీ వర్క్ షాప్ రోడ్డులోని యస్ కన్వెన్షన్ సెంటర్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో ఏపీ బీజేపీ హెడ్ క్వార్టర్స్ ఇన్చార్జ్ ఉప్పలపాటి శ్రీనివాసరాజు, ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి షేక్ బాజీ, పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్,ఎన్టీఆర్ జిల్లా బీజేపీ ఇన్చార్జ్ నార్ని తాతాజీ , పశ్చిమ నియోజకవర్గ సర్ ప్రోగ్రాం కన్వీనర్ పచ్చిపులుసు వెంకట శివప్రసాద్ సంస్థాగత సమావేశంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఉప్పలపాటి శ్రీనివాసరాజు మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటరు జాబితాలో పేరు ఉండేలా చూడాలని తప్పులను సరిదిద్దాలన్నారు.. గ్రామీణ పట్టణ స్థాయిల్లో బీజేపీను మరింత బలోపేతం చేసేందుకు బి ఎల్ ఎ లు సిద్ధంగా ఉండాలన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం అధికారులతో సమన్వయం చేసుకుంటూ పనిచేయాలన్నారు.

రాష్ట్ర అధికార ప్రతినిధి షేక్ బాజీ , ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ఓటే ఆయుధమని పిలుపునిచ్చారు. త్వరలో ప్రచురితమయ్యే ముసాయిదా ఓటరు జాబితాను ప్రతి బి ఎల్ ఎ పరిశీలించాలన్నారు.. ఓటర్ నమోదు మార్పులు, చేర్పులపై బి ఎల్ ఏ లకు దిశా నిర్దేశం చేశారు. ఈ సమావేశంలో దుర్గమ్మ గుడి ట్రస్ట్ బోర్డు సభ్యులు అవ్వారు బుల్లబ్బాయి, ఎన్టీఆర్ జిల్లా బీజేపీ మైనార్టీ మోర్చా అధ్యక్షులు దుర్భేసుల మీరావలి, ఓ బీ సీ మోర్చ జిల్లా అధ్యక్షుడు కందుల సుబ్రమణ్యేశ్వరరావు, బీజేపీ సీనియర్ నేతలు పోతిన భేసు కంటేశ్వరుడు, పైలా సురేష్ , బెన్నా భక్తుల సోమేశ్వరరావు, బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఎన్.ఐ.డి. ప్రాంగణంలో 12వ జాతీయ చేనేత దినోత్సవ ముందస్తు వేడుకలు

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి సమీపంలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (NID) ప్రాంగణంలో 12వ జాతీయ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *