విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వించిపేట ప్రజలకు అందుబాటులోకి రైతుబజారుని తీసుకోని రావాలని డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ 49,50,54 మరియు 55వ డివిజన్ల ఆధ్వర్యంలో నగర కార్యదర్శివర్గ సభ్యులు తాడి పైడయ్య అధ్యక్షతన 174,186 సచివాలయాల వద్ద ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి నగర కార్యదర్శి కామ్రేడ్ జి.కోటేశ్వరరావు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భముగా కోటేశ్వరరావు మాట్లాడుతూ పేద, మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా నివసించే పాతబస్తీ, వించిపేట ప్రాతంలోని ప్రజలకు అందుబాటులో సరసమైన ధరలకు తాజా కూరగాయలు అందించేందుకు 2017 లో అప్పటి నగరపాలక సంస్థ పాలక పక్షం వారు 40 లక్షల అంచనా వ్యయంతో జి+1 ప్రాతిపదికన మొదటి అంతస్థు e సేవ కేంద్రానికి, గ్రౌండ్ ఫ్లోర్ రైతు బజార్ కు నిర్మాణానికి శంకుస్థాపన చేసి తరువాత కాలంలో నిర్మాణం కూడా పూర్తి చేయడం జరిగింది. మొదటి అంతస్థును గతంలోని వైసిపి సచివాలయాలు కేటాయించి అందుబాటులోకి తీస్కొని వచ్చినప్పటికీ, రైతు బజార్ కి ఉద్దేశించిన గ్రౌడ్ ఫ్లోర్లో మాత్రం రైతు బజారు షాపులకు లబ్దిదారులను ఎంపిక చేయడంలో అధికారుల నిర్లక్ష్యం వల్ల నేటికీ రైతు బజారులో షాపులు కేటాయింపులు జరుగక రైతుబజారు ప్రారంభం కాకపోవడం వల్ల ఈ ప్రాంగణం నిరుపయోగంగా మారి సాయంత్రం వేళా సాంఘిక కార్యకలాపాలకు నెలవుగా మారిన పరిస్థితి నెలకొనడం అధికారుల అలసత్వానికి నిదర్శనం అని పేర్కొన్నారు. దీనిపై గతంలో సిపిఐ పార్టీగా నిరసన తెలియజేయటం అలాగే జిల్లా కలెక్టర్ లక్ష్మిషా గారిని కలసి వినతి పత్రం ఇచ్చినప్పటికీ నేటి వరకు ప్రభుత్వంగాని , మున్సిపల్ కమిషనర్ మరియు జిల్లా కలెక్టర్ గాని సానుకూలంగా చర్యలు చేపట్టడంలో వైఫల్యం చెందటం శోచనీయం అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, సంబంధిత అధికారులు సానుకూలంగా స్పందించి రైతు బజారు షాపులకు లబ్దిదారులను గుర్థించి వారికీ తక్షణమే షాపులను కేటాయించి రైతు బజారు ప్రారంభానికి అధికారులను చర్యలు చేపట్టాలని లేని పక్షంలో స్థానిక ప్రజలతో కలసి పెద్ద ఎత్తున ఉద్యమించడానికి సిపిఐ పార్టీగా సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శివర్గ సభ్యులు కొట్టు రమణరావు, నగర పార్టీ నాయకులు బోరా రామకృష్ణ, మోక దుర్గారావు, పైడి కత్తులు రాము, గాడి రాము, తుపాకుల నాగేశ్వరరావు, పిట్ట అప్పారావు, కంచర్ల భార్గవ్, తుపాకుల ప్రతాప్, వినుకొండ శాంక్షన్, బల్ల నరసింహరాజు, చేపూరి నాగేశ్వరరావు, కాయితాల కనకారావు, టంగుటూరు ధనంజయ్ కుమార్, శీరం రవికుమార్, షేక్ సిద్ది, మహిళా నాయకులు షైనీ, చాముండేశ్వరి,సయ్యద్ అఖిల్, వెంకటేశ్వర పోలాస్ వెంకటేశ్వరరావు, వాళ్ల వాసు. గొడుగు శ్రీనివాసరావు, ఎస్ సైమన్, నెక్కింటి గోపికృష్ణ, వాతాటి వెంకటరమణ, అజయ్, కర్రి వీర్రాజు తదితరులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు
Prajavartha Online Telugu News