గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని తూర్పు నియోజకవర్గంలో నూతనంగా ఏర్పాటు చేసిన 56తో కలిపి 312 పోలింగ్ కేంద్రాలు, పశ్చిమ నియోజకవర్గంలో నూతనంగా ఏర్పాటు చేసిన 48 కేంద్రాలతో కలిపి 338 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని రాజకీయ పార్టీల ప్రతినిధులు గమనించాలని తూర్పు నియోజకవర్గ ఏఈఆర్ఓ, డిప్యూటీ కమిషనర్ జి.సాంబశివరావు తెలిపారు. శుక్రవారం కమిషనర్, తూర్పు నియోజకవర్గ ఈఆర్ఓ కె.మయూర్ అశోక్ ఆదేశాల మేరు నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (సర్) పై గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ మాట్లాడుతూ, గుంటూరు నగరంలో కొన్ని ప్రాంతాల్లో ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా పోలింగ్ కేంద్రాల సంఖ్య పెంచడం జరిగిందని, పెరిగిన కేంద్రాల లిస్టు లను గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులకు అందించామని తెలిపారు. ముసాయిదా కాపీలు కూడా రాజకీయ పార్టీలకు అందించడంతో పాటు పోలింగ్ కేంద్రాల్లో కూడా అందుబాటులో ఉంచుతామని తెలిపారు. గుంటూరు నగరంలోని తూర్పు, పశ్చిమ నియోజవర్గాల్లో ఆబ్సెంట్, షిఫ్ట్, డెత్ (ఏఎస్డీ) లిస్టు లను గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులకు అందించామని తెలిపారు.
సమావేశంలో ఏఈఆర్ఓలు సూరజ్ కుమార్, బి.శ్రీనివాసరావు, సిహెచ్.శ్రీనివాస్, డిప్యూటీ తహశీల్దార్లు నాగమల్లేశ్వరావు, సుధా కిరణ్మై, సూపరిండెంట్ బాలాజీ బాష్, సతీష్ (టిడిపి), నారాయణ రెడ్డి, రామ కృష్ణ, కుమార్ (బిజేపి) మహేష్ రెడ్డి, కిషోర్ బాబు (వైస్సార్సీపీ), జానీ భాష (కాంగ్రెస్), డాక్టర్ సేవా కుమార్ (అమ్ఆద్మీ), సిహెచ్.వాసు (బిఎస్పీ ), కార్తీక్ (సిపిఎం), త్రినాద్ (జనసేన) పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News