Breaking News

ప్రధానమంత్రి పర్యటన లక్ష్యంగా జగన్ పరామర్శ కుట్ర

-ఉత్తరాంధ్రలో అల్లర్లు సృష్టించాలనే మహిళా పోలీస్ అధికారిపై దాడి
-మహిళ ఎస్సైపై దౌర్జన్యం చేసిన వారిని కఠినంగా శిక్షించాలి
-జగన్… 16 నెలలు చంచల్ గూడలో ట్రైనింగ్ తీసుకున్నాడు
-ప్రతిపక్ష నాయకులుగా నేరస్థులు ఉంటే వారిని అదుపు చేయడానికి కొత్త చట్టాలు తీసుకురావాలి
-మంగళగిరి కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, ఏపీ ఎంఎస్ఐడీసీ ఛైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
“చంచల్‌గూడ జైలులో 16 నెలలు ట్రైనింగ్ తీసుకున్న జగన్మోహన్ రెడ్డి… తన ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో వేలాది మంది నేరగాళ్లను తయారు చేశార’ని కాకినాడ రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ అన్నారు. నేరప్రవృత్తికి అలవాటుపడిన ఆ క్రిమినల్స్ ను కంట్రోల్ చేయలేని పరిస్థితి రాకూడదన్నారు. పోలీస్ అధికారి ప్రవళికపై వైసీపీ గుండాలు అభ్యంతరకరంగా ప్రవర్తించడం, ఆమెను చుట్టుముట్టి దాడికి యత్నించడం వంటి ఘటనలు రాష్ట్రంలో అశాంతి సృష్టించాలనే ఉద్దేశంతో జరిగినట్లుగా కనిపిస్తున్నాయని చెప్పారు. ఇలాంటి ఘటనలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుని, చట్టప్రకారం శిక్షించాలన్నారు. గతంలో రాజకీయ నాయకులు ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రతిపక్ష పాత్ర పోషించేవారని, ప్రస్తుతం నేరస్థులు ప్రతిపక్ష నాయకులుగా చెలామణి అవుతున్నారని… ఇలాంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని అవసరమైతే చట్టాల్లో కూడా మార్పులు చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. శుక్రవారం మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎంఎస్ఐడీసీ ఛైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా పంతం నానాజీ మాట్లాడుతూ “మనిషి అనేవాడు ఎవరికైనా మంచి, మానవత్వం ఉంటాయి. రోడ్డు మీద ఎవరికైనా ప్రమాదం జరిగితే అయ్యో పాపం అంటాం. బాధితుడికో, బాధితుడు కుటుంబానికో సహాయం చేయాలని కోరుకుంటాం. అంతేగానీ రోడ్డున పోయేవాడు చనిపోయాడు, ఆయనకు వయసైపోయింది అని మాట్లాడిన జగన్ ను ఏమనాలి? ప్రమాదం చేసినవాడిని పాపం పిల్లాడు, వాళ్ల నాన్న ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అని మాట్లాడతాడు. అసలు ఆయనకు మతిస్థిమితం సరిగా ఉందా? చెల్లెలుకు ఆపరేషన్ జరిగితే కనీసం పరామర్శ చేయని వ్యక్తి. ప్రమాదంలో ఒక వ్యక్తిని చంపేసిన వాడికి మద్దతుగా వెళ్తాడు ఇది జగన్ నైజం.
ఉత్తరాంధ్రలో అలజడి సృష్టించడానికి వెళ్లాడు
మాజీ మంత్రి సిదిరి అప్పలరాజును పరామర్శించడానికి ఉత్తరాంధ్ర వెళ్తున్నానని చెప్పిన జగన్ చివరకు ఆయనను పరామర్శించారా అంటే అది లేదు. ఎందుకు కలవలేదు అని అడిగితే ములాఖత్ సమయం ముగిసిందని చెబుతున్నారు. ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తికి జైలు ములాఖత్ సమయాలపై కనీస అవగాహన లేదా? నిజంగా జగన్ పరామర్శించడానికే వెళ్తే ఒక రోజు ఉండైనా పరామర్శించేవారు. ఆయన వెళ్లిన కారణం వేరే ఉంది. శనివారం భోగాపురంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న నేపథ్యంలో, ఆ కార్యక్రమానికి ముందు ఉత్తరాంధ్రలో ఉద్రిక్త పరిస్థితులు సృష్టించాలనే ఉద్దేశంతోనే జగన్ అక్కడికి వెళ్లారు. పరామర్శ పేరుతో జరిగిన ఈ పర్యటన వెనుక రాజకీయ కుట్ర ఉంది.
అంబటి రాంబాబును సొంత పార్టీ నాయకులే అసహ్యించుకుంటున్నారు
ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకుంటే వైసీపీ నేత అంబటి రాంబాబు పోలీసులను తోసేయడం, వారితో అనుచితంగా ప్రవర్తించడం సరికాదు. ఆయన ప్రవర్తన చూసి సొంత పార్టీ నాయకులే అసహ్యించుకుంటున్నారు. అంబటి రాంబాబు అలా ప్రవర్తించి ఉండాల్సింది కాదని సీనియర్ నాయకులు బొత్స సత్యనారాయణ మాట్లాడారు. నేను రాంబాబు అంత చిల్లరగా మాట్లాడలేనని పెద్దిరెడ్డి అన్నారు. ఆయన ప్రవర్తన వాళ్ల పార్టీ నాయకులకే చిరాకు తెప్పించింది.
నేరగాళ్లకే వైసీపీ సపోర్ట్
వైసీపీ నేరస్థుల పార్టీ
నేరాలకు పాల్పడిన వారిని ప్రోత్సహించే పార్టీగా వైసీపీ మారింది. ఒక ఎస్సీ వ్యక్తికి శిరోముండనం చేసిన ఘటనలో తోట త్రిమూర్తులు ఆరోపణలు ఎదుర్కొన్నప్పటికీ, ఆయనను పార్టీలో చేర్చుకుంది. ఆయన ఇంట్లోనే కాపు సామాజిక వర్గ సమావేశం నిర్వహించింది. అలాగే, దళిత యువకుడు సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొన్న అనంతబాబుకు కూడా వైసీపీ అండగా నిలిచింది. ఇటువంటి ఘటనలు చూస్తే వైసీపీ నేరస్థులను ప్రోత్సహించే పార్టీగా, గొడ్డలి పార్టీగా మారిందనే అభిప్రాయం కలుగుతోంది. నేరాలకు పాల్పడిన వారిని సమర్థించే రాజకీయాలకు ప్రజలు తగిన సమయంలో గట్టి సమాధానం చెబుతారని అన్నారు.
వచ్చే ఎన్నికల్లో 11 సీట్లూ కూడా రావు : చిల్లపల్లి శ్రీనివాస రావు
ఏపీ ఎంఎస్ఐడీసీ ఛైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ… పోలీస్ అధికారిణి ప్రవళిక మీద వైసీపీ గుండాలు అభ్యంతరకర రీతిలో ప్రవర్తించడం, చుట్టుముట్టి దాడి చేయడం చూస్తుంటే వాళ్ళకి ఉత్తరాంధ్రలో అశాంతి కలిగించే లక్ష్యంతో వెళ్లారు అనిపిస్తోంది. బీసీల మీద కూటమి ప్రభుత్వానికి ప్రేమ లేదు, బాధ్యత లేదు అని నిన్న చిలకపలుకులు పలికిన జగన్… ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళ అధికారిపై వైసీపీ రౌడీమూకలు దాడి చేసి, అసభ్యంగా ప్రవర్తిస్తే ఎందుకు స్పందించలేదు? బీసీలన్నా, ఎస్సీ, ఎస్టీలన్నా జగన్ కు చిన్నచూపు. సొంత చెల్లెలు ఆపరేషన్ జరిగితే పరామర్శ చేయమని జగన్… గంజాయ్ బ్యాచ్ లకు, క్రిమినల్స్ కు, ప్రమాదాలు చేసి ప్రాణాలు తీసేసే వ్యక్తులను మాత్రం పరామర్శిస్తార”ని అన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఎన్.ఐ.డి. ప్రాంగణంలో 12వ జాతీయ చేనేత దినోత్సవ ముందస్తు వేడుకలు

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి సమీపంలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (NID) ప్రాంగణంలో 12వ జాతీయ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *