-టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు బుద్ధా వెంకన్న
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్డీయే కూటమి ప్రభుత్వంలో అవినీతి అక్రమాలకు తావు లేకుండా పశ్చిమలో ఎమ్మెల్యే సుజనా చౌదరి ప్రజా పాలన చేస్తున్నారని టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు ,మాజీ ఎమ్మెల్సీ ,టీడీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జ్ బుద్ధా వెంకన్న అన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ” ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం భవానిపురం 42 వ డివిజన్ లో శుక్రవారం విజయవంతంగా కొనసాగింది.
పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, మాజీ కార్పొరేటర్ యేదుపాటి రామయ్య, జనసేన పార్టీ 42 వ డివిజన్ అధ్యక్షురాలు తిరుపతి అనూష, టీడీపీ 42 వ డివిజన్ అధ్యక్షుడు పత్తి నాగేశ్వరరావు, చల్లంరాజు వెంకట శేషయ్య ట్రస్ట్ బోర్డు చైర్మన్ ముదిగొండ శివ, జనసేన పార్టీ ప్రచార కమిటీ కోఆర్డినేటర్ తిరుపతి సురేష్ మరియు కూటమి శ్రేణులతో కలిసి బుద్ధా వెంకన్న ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం నిర్వహించారు.
రెండేళ్ల పాలనలో కూటమి ప్రభుత్వం సాధించిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించారు..
ఈ సందర్భంగా బుద్ధా వెంకన్న మాట్లాడుతూ ఎన్నికల ముందు చెప్పినట్లే ఎమ్మెల్యే సుజనా చౌదరి పశ్చిమ నియోజకవర్గం లో అవినీతి , అక్రమాలకు తావు లేకుండా, ప్రజలు కోరుకుంటున్న ప్రజా పాలనను అందిస్తున్నారన్నారు విద్య, వైద్య రంగాలను బలోపేతం చేస్తూ ఉచిత ఆరోగ్య సేవలు అందిస్తూ మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా ఎమ్మెల్యే సుజనా నిరంతరం కృషి చేస్తున్నారన్నారు.
45 రోజులపాటు జరగనున్న ప్రజా చైతన్య కార్యక్రమంలో గడపగడపకు వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలను విజయాలను ప్రజలకు వివరిస్తామని బుద్ధా వెంకన్న తెలిపారు. ఈ పర్యటనలో నగరాల కార్పొరేషన్ డైరెక్టర్ సాయి సుధాకర్, టీడీపీ రాష్ట్ర నాయకులు గుర్రం కొండ , పశ్చిమ నియోజకవర్గ బీ సీ సెల్ అధ్యక్షుడు ముదిరాజ్ శివాజీ, కూటమి నేతలు ధనేకుల వెంకట సుబ్బారావు,నేలకుర్తి వెంకట్రావు, కాకొల్లు సురేష్, స్రవంతి, సయ్యద్ అలీ,మొరబోయిన రాంబాబు, కామదేవరాజ్,
అలుగుండ్ల సుబ్బారెడ్డి,తదితరులు పాల్గొన్నారు..
Prajavartha Online Telugu News