Breaking News

సమాజ సేవలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి.

-ఆపదలో ఉన్న బాలలకు అనాధ బాలలకు చేయూతనివ్వాలి.
-రక్తదానం మరొకరికి ప్రాణదానం కావాలి.
-ప్రాఫిట్ షూ కంపెని మేనేజింగ్ డైరెక్టర్ మరియు ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్, డైరెక్టర్ బి. ఎస్ . కోటేశ్వరరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రాఫిట్ షూ కంపెని అధినేత, మేనేజింగ్ డైరెక్టర్ & ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్ డైరెక్టర్ అయిన బి. ఎస్.కోటేశ్వరరావు జన్మదినోత్సవ సందర్భంగా శుక్రవారం ప్రాఫిట్ షూ కంపెని ఆధ్వర్యంలో కేరి అండ్ షేర్ చారిటబుల్ ట్రస్ట్ లోని బాలలకు చేయూతనిస్తూ వారికి కావలసిన నిత్యవసర సరుకులు మరియు ఆహారం, పండ్లను మరియు 30 వేల రూపాయలను ఆర్థిక సహాయంగా స్వయంగా అందజేయడం జరిగింది .
ఈ సందర్భంగా బి. ఎస్ . కోటేశ్వరరావు మాట్లాడుతూ ఆపదలో ఉన్న బాలలను అనాధ బాలలను ఆదుకోవడం ప్రతి ఒక్కరు బాధ్యతని ఇలాంటి బాలల ఉండే ఆశ్రమాలను ప్రతి ఒక్కరు సందర్శించి సహాయ సహకారాలు అందించాలని కోరారు.
అంతకుముందు హనుమాన్ పేటలో కల ప్రాఫిట్ షూ కంపెని హెడ్ ఆఫీస్ లో ప్రాఫిట్ ఉద్యోగస్తులందరూ కలిసి విజయవాడ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ వారు సహకారంతో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రాఫిట్ సిబ్బంది రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా రక్త దాతలను అభినందిస్తూ సర్టిఫికెట్ ప్రధానం చేసే కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ముఖ్య అతిథులుగా విచ్చేసిన అమెరికాలోని ప్రముఖ హోటల్స్ వ్యాపారవేత్త పొడి దోస హోటల్ నిర్వాహకులు నాగేశ్వరరావు మాట్లాడుతూ
ప్రాఫిట్ సంస్థ సమాజంలో ఎప్పుడూ తన బాధ్యతను గుర్తెరిగి సమాజ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండటం అభినందించదగ్గ విషయమని తెలిపారు. .బి.ఎస్. కోటేశ్వరరావు అనాధ బాలల, వీధి బాలల రక్షణకు ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్ ద్వారా ఎంతో కృషి చేశారని, చేస్తున్నారని అభినందించారు. ఈ సందర్భంగా సంస్థ అధినేత బీఎస్ కోటేశ్వరావు కి రెడ్ క్రాస్ సంస్థ తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు, అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేశారు.
ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్ కోఆర్డినేటర్ మాట్లాడుతూ సమాజ సేవకు ముందు ఉంటున్న ప్రాఫిట్ సిబ్బందికి అభినందనలు తెలిపారు.
తదనంతరం సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ బి. ఎస్ . కోటేశ్వరరావు చేతుల మీదుగా రక్త దాతలు అభినందిస్తూ సర్టిఫికెట్లు ప్రధానం చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ప్రాఫిట్ షూ కంపెనీ సంస్థ సీనియర్ సిబ్బంది చీఫ్ హెచ్. ఆర్. మేనేజర్ మేనేజర్ రామ్మోహన్ రెడ్డి , సుబ్బారావు,
బత్తుల.రాంబాబు, భాస్కర రావు, రాజేష్, శ్రీధర్, సురేష్, ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్ కోఆర్డినేటర్ ఆరవ.రమేష్, బర్డ్స్ సంస్థ సెక్రటరీ కోటే. ప్రకాష్ కుమార్, ప్రజా గాయకులు ఆర్ పిచ్చయ్య, కేరింగ్ షేర్ చారిటబుల్ ట్రస్ట్ మేనేజర్ పసల రత్నం, ప్రాఫిట్ షూ కంపెనీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఎన్.ఐ.డి. ప్రాంగణంలో 12వ జాతీయ చేనేత దినోత్సవ ముందస్తు వేడుకలు

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి సమీపంలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (NID) ప్రాంగణంలో 12వ జాతీయ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *