Breaking News

జువైనైల్ జస్టిస్ యాక్ట్ 2015 సవరణలపై సూచనలు ఆహ్వానిస్తున్నాం

-ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (APSCPCR) చైర్‌పర్సన్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
బాలల సంరక్షణ, రక్షణ , పునరావాస చట్టపరమైన ప్రక్రియలను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో కేంద్ర మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ, జువైనైల్ జస్టిస్ (కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్) యాక్ట్, 2015పై స‌మీక్షిస్తున్న కేంద్ర‌ప్ర‌భుత్వం చట్టంలో అవసరమైన సవరణలు, కొత్త ప్రతిపాదనలపై సలహాలు, సూచనలను ఆహ్వానిస్తోంద‌ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్‌పర్సన్ వేటుకూరి ఎ.వి.ఎస్. సూర్యనారాయణ రాజు ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. సంబంధిత శాఖల అధికారులు, సంస్థలు, భాగ‌స్వామ్య‌దారులు, బాలల కోసం పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థలు, వివిధ వర్గాల ప్రజలు నిర్ణీత ఫార్మాట్‌లో తమ సలహాలు, సూచనలను సకాలంలో సమర్పించాలని కోరారు. రాష్ట్ర‌స్థాయిలో అన్ని ప్రతిపాదనలను ఆగస్టు 7వ తేదీ నాటికి apscpcr2018@gmail.com కు సమర్పించాలని చైర్‌పర్సన్ సూచించారు. సూచనలను Word లేదా PDF రూపంలో 14 ఆగస్టు 2026 నాటికి cw2section-mwcd@gov.in ఈమెయిల్ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి కూడా నేరుగా పంపవచ్చని స్పష్టం చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఎన్.ఐ.డి. ప్రాంగణంలో 12వ జాతీయ చేనేత దినోత్సవ ముందస్తు వేడుకలు

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి సమీపంలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (NID) ప్రాంగణంలో 12వ జాతీయ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *