-ఆగష్టు 25 నుండి రాష్ట్ర వ్యాప్తంగా సంస్కృత సప్తాహం వారోత్సవాలు
-ఆగస్టు 29 గిడుగు రాంమూర్తి జయంతి వేడుకలు -సాహితీ వేత్తలకు అవార్డు బహుకరణ
-తెలుగు మరియు సంస్కృత అకాడమీ చైర్మన్ ఆర్. డి. విల్సన్ @ శరత్ చంద్ర
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
సంస్కృతం పండితుల భాష గా ప్రజల్లో నానుడి ఉందని దాన్ని చెరిపి వేసి సామాన్యులకు సంస్కృత భాష చేర్చే కార్యాచరణ అకాడమీ చేపడుతుందని తెలుగు మరియు సంస్కృత అకాడమీ చైర్మన్ ఆర్. డి. విల్సన్ @ శరత్ చంద్ర అన్నారు. వడ్డెశ్వరం లోని తెలుగు మరియు సంస్కృత అకాడమీ కార్యాలయం లో శుక్రవారం జరిగిన పాత్రికేయ సమావేశంలో అకాడమీ సిబ్బంది, సంస్కృత పoడితులతో కలిసి పాత్రికేయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో సంస్కృత అకాడమీ ఏర్పాటు తర్వాత ఏ ప్రభుత్వం కూడా నిధులు కేటాయించలేదని.. సంస్కృత భాష వ్యాప్తి కి నిధులు అవసరం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తగిన నిధులు కేటాయిస్తే తప్పా సంస్కృత భాషాభివృద్ధి సాధ్యం కాదని అన్నారు.
నిధుల సమీకరణ కు ఢిల్లీ యాత్ర
హైదరాబాద్ లో ఉన్నట్టు ఆంధ్రప్రదేశ్ లో వున్న సంస్కృత అకాడమీ అభివృద్ధి కి నిధులు కేటాయించమని కోరుతూ జూలై 3,4,5 తేదీల్లో ఢిల్లీ లోని కేంద్ర సంస్కృత యూనివర్సిటీ వైస్ చాన్స్ లర్ ప్రొఫీసర్ శ్రీనివాస్ వరకేది గారిని, భారతీయ భాష సమితి చైర్మన్ కృష్ణ స్వామి గారిని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద జోషి గారిని సంప్రది స్తున్నట్టు తెలియ చేశారు.
ఆంధ్రప్రదేశ్ లో జరిగే సంస్కృత సప్తాహం కార్యక్రమ వివరాలు తెలియ చేశారు.ఆగస్టు 25 శ్రీకాకుళం, విజయనగరం.
26న విశాఖపట్నం, కొవ్వూరు.
27 న తణుకు, గుంటూరు,
28 న జిల్లెళ్ళమూడి, నెల్లూరు.
29 తిరుపతి, కడప.
30న అనంతపురం, కర్నూలు.
31 న గుడివాడ, విజయవాడ లో సమాపన కార్యక్రమం ఉంటుంది అని తెలియ చేశారు. ఇందులో భాగంగా శ్రీకాకుళం లో ఎన్. టి. ఆర్ మున్సిపల్ హై స్కూల్ లోనూ, విజయ నగరం యం. ఆర్ ప్రభుత్వ సంస్కృత పాఠశాల లోనూ,విశాఖపట్నం లో భారతీయ విద్యాకేంద్రం లోనూ, కొవ్వూరు లో వాడ్రేవు జోగమ్మ వేద సంస్కృత కళాశాల లోనూ లేదా ఆంధ్ర గిర్వాణ విద్యాపీఠం లో జరుగుతుంది అన్నారు.
తణుకు లో ఎస్. కే. డి మహిళా కళాశాల లో, గుంటూరు లో శారదా నీకేతన్ లోనూ, జిల్లెళ్ల మూడి లో మాతృ శ్రీ ఒరియంటల్ కళాశాల లో జరుగుతుంది అన్నారు.
నెల్లూరు లో జి. వి ఆర్ కళాశాల లోనూ, తిరుపతి లో జాతీయ సంస్కృత విశ్వ విద్యాలయం లో, కడప లో కోదండ రామాలయం లోనూ, అనంతపురం శృoగేరి మఠం లో జరుగుతుంది అని తెలిపారు. కర్నూల్ లో స్వామి వివేకానంద సంస్కృత పాఠశాల గుడివాడ ఉపద్రస్ట వారి సత్రం లో జరుగుతుంది అన్నారు.
విజయవాడ లో సమాపన కార్యక్రమం
సంస్కృత సప్తాహం ముగింపు కార్యక్రమం విజయవాడ లోని ఘంటసాల వెంకటేశ్వర రావు ప్రభుత్వ సంగీత కళాశాల లో జరుగుతుంది అని విల్సన్ శరత్ చంద్ర తెలిపారు.
ఆయా జిల్లాల్లో జరిగే సప్తాహం కార్యక్రమం సందర్బంగా విద్యార్థులకు భారతం,భాగవతం తో పాటు ఇతర క్విజ్ ప్రోగ్రామ్స్ కూడా నిర్వహించడం జరుగుతుంది అని సిబ్బంది తెలియ చేశారు. అదే సమయం సంస్కృతం లో విశేష కృషి చేసిన వారికి మేమెంటోస్ తో గౌరవిస్తాము అని తెలియ చేస్తూ గతం లో ఎన్నడూ జరగని రీతిలో సప్తాహం జరుగుతుంది అన్నారు.
29 గిడుగు జయంతి
ఆగష్టు 29 న తెలుగు భాష ను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లిన గిడుగు రామూర్తి జయంతి కి తెలుగు భాషా, మరియు తెలుగు సంస్కృతి కి విశేషం గా కృషి చేసిన తెలుగు భాషా ప్రముఖులకి అవార్డు బహుకరణ ఉంటుంది అని చైర్మన్ విల్సన్ శరత్ చంద్ర తెలిపారు.అకాడమీ ఆవరణలోనే ఈ కార్యక్రమం జరుగుతుంది అని తెలిపారు.
పాత్రికేయ సమావేశం లో అకాడమీ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ కోటేశ్వరమ్మ, డాక్టర్ ఎస్. ఏ. టి. రాజ్యలక్ష్మి, డాక్టర్ పి. కోటి కోటి రత్నం, తో పాటు సంస్కృత పండితులు కార్యక్రమ సంధాన కర్త డాక్టర్ పి. టి. జి వి రంగాచర్యలు వున్నారు.
Prajavartha Online Telugu News