రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యులు దగ్గుబాటి పురందేశ్వరి మంగళవారం (25-08-2026) సాయంత్రం రాజమహేంద్రవరానికి చేరుకోనున్నారు. ఈ పర్యటన సందర్భంగా రాజమహేంద్రవరంలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఈ నెల 26వ తేదీ బుధవారం ఉదయం 10 గంటలకు క్వారీ మార్కెట్ వద్ద ఉన్న తూర్పుగోదావరి జిల్లా బీజేపీ కార్యాలయంలో నిర్వహించే బీజేపీ జిల్లా కార్యవర్గ సమావేశంలో పాల్గొంటారు. అనంతరం 27వ తేదీ గురువారం ఉదయం 10.30 గంటలకు రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో నిర్వహించే DISHA సమావేశంలో ఎంపీ శ్రీమతి దగ్గుబాటి పురందేశ్వరి పాల్గొంటారు.
Prajavartha Online Telugu News