Breaking News

ఏపీ సిఆర్డిఏ కార్యాలయంలో “గ్రీవెన్స్ డే” నిర్వహణ..అర్జీలు స్వీకరించిన అడిషనల్ కమిషనర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజారాజధాని అమరావతిలో రైతులు, రైతు కూలీల సమస్యల పరిష్కారం కోసం రాయపూడిలోని APCRDA ప్రధాన కార్యాలయంలో సోమవారం “గ్రీవెన్స్ డే” నిర్వహించారు. రాజధాని రైతులు, గ్రామస్తులు తమ సమస్యల పరిష్కారం నిమిత్తం అర్జీలను అడిషనల్ కమిషనర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి IAS గారికి అందజేశారు. అర్జీదారులు అందజేసిన సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని అడిషనల్ కమిషనర్ గారు తెలియజేశారు. అలాగే కొన్ని సమస్యల పరిష్కారం ప్రభుత్వ నిర్ణయానుసారం ఉంటుందన్నారు. రైతులు, స్థానికుల సౌకర్యార్థం CRDA ప్రధాన కార్యాలయంలో సిటిజన్ గ్రీవెన్స్ సెంటర్(సీజీసీ) వద్ద ప్రతి రోజూ పనివేళలలో CRDA సిబ్బంది అర్జీలు స్వీకరిస్తారని..ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చన్నారు. అలాగే ప్రతి సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు రాయపూడిలోని APCRDA ప్రధాన కార్యాలయంలో “గ్రీవెన్స్ డే” జరుగుతుందన్నారు. నేడు నిర్వహించిన గ్రీవెన్స్ డేలో 17 ఫిర్యాదులు వచ్చాయి. వచ్చిన ఫిర్యాదులలో 8 ఫిర్యాదులు ల్యాండ్స్‌, 9 ఫిర్యాదులు డెవలప్మెంట్ ప్రమోషన్ & ప్లానింగ్, సోషల్ డెవలప్మెంట్ తదితర విభాగాలకు చెందినవి.

అదే విధంగా “గ్రీవెన్స్ డే” నిర్వహణతో పాటు రాజధాని రైతుల NPCI/ బ్యాంక్ లింకేజి సంబంధిత సమస్యలను పరిష్కరించేందుకుగాను APCRDA ప్రధాన కార్యాలయంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడం జరిగింది. హెల్ప్ డెస్క్‌లోని APCRDA సిబ్బంది..పలువురు రైతులకు NPCI లింకేజి ప్రక్రియ పూర్తి చేశారు. దీంతో ఆయా రైతుల ఖాతాలలో వార్షిక కౌలు జమ కానుంది.

గ్రీవెన్స్ డేలో APCRDA గ్రీవెన్స్ రిడ్రెస్సల్ మేనేజ్‌మెంట్(GRM) నోడల్ అధికారి పి.జయశ్రీ, సోషల్ డెవలప్మెంట్ విభాగ గ్రూప్ డైరెక్టర్ వి. రాములు, డైరెక్టర్- ల్యాండ్స్(క్యాపిటల్ సిటీ) కె.ఎస్.భాగ్యరేఖ, డైరెక్టర్- ల్యాండ్స్(క్యాపిటల్ రీజియన్) బి.గాయత్రీ దేవి, HR విభాగ డైరెక్టర్ బి.మల్లిఖార్జున రెడ్డి, ప్లానింగ్ విభాగ డైరెక్టర్ బి.సురేష్ కుమార్, డెవలప్మెంట్ ప్రమోషన్ విభాగ డైరెక్టర్ వి.సునీత, లీగల్ విభాగ మేనేజర్ దీపక్ రాయ్, అడిషనల్ డైరెక్టర్(లీగల్) ఎం.వెంకటేశ్వరరావు, ఎస్టేట్స్ విభాగ జాయింట్ డైరెక్టర్(FAC) జుబిన్ రాయ్, కమ్యూనికేషన్స్ విభాగ జాయింట్ డైరెక్టర్ జి.రామరాజు, ఎకనామిక్ డెవలప్మెంట్ మేనేజర్(FAC) అంజనా జేమ్స్, డిప్యూటీ డైరెక్టర్(సర్వే) GP రామకృష్ణన్, IT విభాగ అడిషనల్ డైరెక్టర్ వి. కుష్వంత్, హార్టీకల్చర్ అడిషనల్ డైరెక్టర్(FAC) బి.జె. బెన్నీ, ADCL నుంచి సీఈ జి. వెంకటేశ్వరరావు, ఎస్ఈలు కె.శ్రీనివాసరావు, వి.శ్రీనివాస్, డి.విజయ్ కుమారి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

శ్రీ కృష్ణాష్టమి వేడుకలలో దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా తూర్పు నియోజకవర్గంలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *