Breaking News

నర్సరావుపేటలో కోటప్పకొండ దేవాలయాన్ని సందర్శించిన మంత్రి లోకేష్

నర్సరావుపేట, నేటి పత్రిక ప్రజావార్త :
పల్నాడు జిల్లా పర్యటనలో భాగంగా బుధవారం సాయంత్రం నర్సరావుపేట సమీపంలోని కోటప్పకొండ దేవాలయాన్ని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సందర్శించారు. ముందుగా ఆలయ ప్రాంగణానికి చేరుకున్న మంత్రి లోకేష్ కు వేదపండితులు, ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేదాశీర్వచనం చేశారు. అనంతరం ఆలయ అధికారులు మంత్రి లోకేష్ ను ఘనంగా సత్కరించి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో డి.చంద్రశేఖర్ రావు, సూపరింటెండెంట్ సీహెచ్.శ్రీనివాసరావుతో పాటు పలువురు టీడీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

శ్రీ కృష్ణాష్టమి వేడుకలలో దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా తూర్పు నియోజకవర్గంలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *