Breaking News

పిఠాపురం ఆడపడుచులకు పవన్ కళ్యాణ్ శ్రావణ మాస కానుక

-10 వేల మంది మహిళలకు చీరలు, పసుపు, కుంకుమలు పంపిణీ
-శ్రీ పురుహూతిక అమ్మవారి సన్నిధిలో వైభవంగా సామూహిక వరలక్ష్మీ వ్రతాలు
-అమ్మవారికి పట్టువస్త్రాల సమర్పణతో ప్రారంభమైన వరలక్ష్మీ వ్రత మహోత్సవం
-భక్తుల సౌకర్యార్థం పకడ్బందీ ఏర్పాట్లు
-భక్తిశ్రద్ధలతో వరలక్ష్మీ వ్రతంలో పాల్గొన్న నియోజకవర్గ మహిళలు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
పిఠాపురం ప్రజలతో, ముఖ్యంగా నియోజక వర్గంలోని ఆడపడుచులతో తనకున్న అనుబంధాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరోసారి చాటి చెప్పారు. శ్రావణ మాసం చివరి శుక్రవారం సందర్భంగా నియోజకవర్గంలోని దాదాపు 10 వేల మంది ఆడపడుచులకు చీరలు, పసుపు, కుంకుమలను శ్రావణ మాస కానుకగా అందించారు. పిఠాపురంలోని ప్రముఖ శక్తి పీఠమైన శ్రీ పురుహూతిక అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఆడపడుచుల కోసం సామూహిక వరలక్ష్మీ వ్రతాలను ఘనంగా నిర్వహించారు. వ్రతానికి అవసరమైన పూజా సామగ్రిని ఉచితంగా అందించడంతో పాటు, వేద పండితుల ఆధ్వర్యంలో సంప్రదాయబద్ధంగా పూజా కార్యక్రమాలను నిర్వహించారు. వేలాది మంది మహిళలు భక్తిశ్రద్ధలతో ఈ సామూహిక వరలక్ష్మీ వ్రతంలో పాల్గొని అమ్మవారిని పూజించారు.
భక్తిశ్రద్ధలతో వరలక్ష్మీ వ్రతాచరణ
శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకుని శ్రీ కుక్కుటేశ్వర స్వామి, శ్రీ పురూహూతిక అమ్మవారి దివ్యక్షేత్రంలో వరలక్ష్మీ వ్రతాలు వైభవంగా నిర్వహించారు. వేకువజాము నుంచే పెద్ద సంఖ్యలో మహిళలు ఆలయానికి చేరుకుని భక్తిశ్రద్ధలతో వ్రత పూజల్లో పాల్గొన్నారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య వరలక్ష్మీ దేవిని ప్రతిష్ఠించి పూజా కార్యక్రమాలను ప్రారంభించారు. తొలుత పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు తుమ్మల రామస్వామి (బాబు), పార్టీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ ఛైర్మన్ కళ్యాణం శివ శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు అమ్మవారికి పట్టువస్ర్తాలను సమర్పించారు. అనంతరం గణపతి పూజ, కలశ పూజతో పాటు అమ్మవారికి అష్టోత్తర శతనామావళి, వరలక్ష్మీ స్తోత్రాలు, షోడశోపచార పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు వరలక్ష్మీ వ్రత మహిమను వివరిస్తూ వ్రతకథను భక్తులకు వినిపించారు. నాలుగు విడతలుగా జరిగిన సామూహిక వరలక్ష్మీ వ్రత పూజల్లో నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది మహిళలు పాల్గొన్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు, ఆలయ మరియు మున్సిపల్ సిబ్బంది, జనసేన పార్టీ వాలంటీర్లు, సమన్వయంతో ఏర్పాట్లు చేశారు. అత్యవసర సమయాల్లో వైద్య సేవలు అందించేందుకు ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక వైద్య శిబిరాన్ని కూడా అందుబాటులో ఉంచారు.
ఐదు విడతలుగా వరలక్ష్మీ వ్రతమాచరించిన మహిళలు
వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించేందుకు వేలాది మంది మహిళా భక్తులు తరలిరావడంతో వేద పండితులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని మహిళలతో ఐదు విడతలుగా వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరింపజేశారు. తొలి విడతలో ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు వ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం రెండో విడతను ఉదయం 7 గంటల నుంచి 8 గంటల వరకు నిర్వహించారు. మూడో విడతలో ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు, నాలుగో విడతలో ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు, ఐదో విడత 10 గంటల నుంచి 11 వరకు వేద పండితులు మహిళలతో వరలక్ష్మీ వ్రతాలను భక్తిశ్రద్ధలతో నిర్వహింపజేశారు. ఏటా జరిగే విధంగానే సంప్రదాయాన్ని గౌరవిస్తూ సామూహిక వరలక్ష్మీ వ్రతాలు ఆచరించిన ఆడపడుచులకు పవన్ కళ్యాణ్ పసుపు, కుంకుమ, చీరలను కానుకగా పంపించారు.
ఈ కానుకలను కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు తుమ్మల రామస్వామి, పార్టీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ ఛైర్మన్‌ కళ్యాణం శివ శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు, ఫైవ్ మెన్ కమిటీ సభ్యుడు ఓదూరి కిశోర్, కాపు కార్పొరేషన్ డైరెక్టర్ చల్లా లక్ష్మి, జనసైనికులు, వీరమహిళలు పర్యవేక్షించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

శ్రీ కృష్ణాష్టమి వేడుకలలో దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా తూర్పు నియోజకవర్గంలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *