Breaking News

విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ కు 500 కోట్లు బడ్జెట్ కేటాయించాలి

-గురజాడ ఆనంద్ కుమార్ ఏపీ విశ్వబ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షులు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బ్రహ్మశ్రీ డాక్టర్ గురజాడ ఆనంద్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ గత 12 సంవత్సరాల నుండి రెన్యువల్ లేనందున నూతనంగా ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ సంఘం ఆంధ్రప్రదేశ్లో నాయకులతో నూతన కార్యవర్గం ఏర్పాటయిందని, ఆన్లైన్ చేయడానికి నెల సమయం పడుతుందని తెలియజేశారు. దీనిపై రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘాలు ఎటువంటి అపోహలకు లోను కావద్దని కోరుతున్నామన్నారు. ఏపీ విశ్వబ్రాహ్మణ సంఘం 563 బార్ 73 నూతన కార్యవర్గాన్ని జిల్లా కమిటీలను గ్రామస్థాయి నుండి త్వరలో ఏర్పాటు చేసి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలకు సిద్ధం చేస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో ఉన్న ఐదు వృత్తుల కమ్మరి,వడ్రంగి,ఇత్తడి పని, బంగారం పని, విగ్రహాల పనులు చేసుకునే విశ్వబ్రాహ్మణుల కు పనులు లేక చాలా ఇబ్బందులు పడుతున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం వారికి 50 సంవత్సరాలకే ఫించన్ ఇస్తామని హామీ ఇచ్చిందని హామీని నెరవేర్చవలసిందిగా డిమాండ్ చేస్తున్నామన్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ గా 500 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించి మా సంఘాలకు సబ్సిడీ రుణాలు అందించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము.
ఈ కార్యక్రమంలో పులివెందుల విశ్వబ్రాహ్మణ సంఘ ప్రధాన కార్యదర్శి బండి కట్టు మహేష్ ఆచార్య, ఏపీ యువజన అధ్యక్షులు ఎం హరి ప్రసాద్, ఎన్టీఆర్ జిల్లా బీసీ అధ్యక్షులు ఎం సత్యవతి సత్యవతి, విశ్వబ్రాహ్మణ కార్యవర్గ సభ్యులు సిహెచ్ మోహన్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పట్టాల పంపిణీతో 26వేల పేద కుటుంబాలకు భరోసా

-డబుల్ ఇంజన్ సర్కార్‌తో పేదలకు వందల రెట్ల లబ్ది -ఎన్టీఆర్ జిల్లాలో ఇంటి పట్టాలు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *