విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వాసవ్య మహిళా మండలి అపోలో టైర్ హెల్ట్ కేర్ సెంటర్ మరియు ఎన్టీఆర్ జిల్లా టీబీ నియంత్రణ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం అటోనగర్ 2వ రోడ్డు వద్ద ఉచిత మెగా వైద్య శిబిరం జరిగింది. ఈ సందర్భంగా వైద్యాధికారిని ఆర్. స్వర్ణలత మాట్లాడుతూ ప్రపంచ ఊపిరి తిత్తుల రోజు ను పురస్కరించుకొని ఈ వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నామని, ఈ శిబిరంలో సాధారణ అనారోగ్య సమస్యలకి మందులతో పాటుగా,కంటి పరీక్ష,షుగర్, బీపీ చూస్తున్నారని, అంతేకాకుండా సిబ్బంది వివిధ కార్యక్రమాల ద్వార టీబీ పై అవగాహన కల్పిస్తున్నారని అన్నారు. టీబీ గాలి ద్వారా ఒకరి నుండి ఇతరులకు సులభంగా సంక్రమిస్తుంది. ఇది ముఖ్యంగా పొగాకు ఉత్పత్తులు వాడేవాళ్ళకి, షుగర్ అదుపులో లేనివారికి, హెచఐవి సోకినవారు మందులు సరిగా వాడని వాళ్ళకి, స్టెరాయిడ్ మందులు అధిక మోతాదులో వాడేవాళ్ళకి టీబీ వచ్చే అవకాశాలు ఉన్నాయని అన్నారు
అనంతరం ఎస్ టి ఎస్ ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ఎన్టీఆర్ జిల్లా టీబీ నియంత్రణ సంస్థ అధికారి డాక్టర్ భాను నాయక్ ఆదేశాల మేరకు ఏఐ పరిజ్ఞానంతో అత్యాధునిక ఎక్స్-రే ద్వారా టీబీ పరీక్షలు చెస్తున్నామని అన్నారు, ప్రతి ఒక్కరు టీబీ మీద అవగాహన కలిగి జాగ్రత్తలు తీసుకోవాలని. టీబీ లక్షణాలైన ఒక వారం లేదా అంతకంటే ఎక్కువ రోజులు నిరంతరంగా దగ్గు ఉండటం, దగ్గుతున్నప్పుడు కఫంతో పాటు రక్తం పడటం, ముఖ్యంగా సాయంత్రం లేదా రాత్రి సమయంలో తీవ్రమైన జ్వరం, చలిగా ఉండటం, రాత్రి పడుకున్నప్పుడు విపరీతంగా చెమటలు పట్టడం, శరీర బరువు గణనీయంగా తగ్గడం, దగ్గుతున్నప్పుడు లేదా గాలి పీల్చేటప్పుడు ఛాతీలో నొప్పి కలగడం, ఆకలి మందగించడం. ఈ లక్షణాలలో ఏదైనా ఒకటి ఉన్నా ఆలస్యం చేయకుండ దగ్గర లోని ఆరోగ్య సంరక్షణ కేంద్రాన్నీ సందర్సిం చాలని అన్నారు
ఈ కార్యక్రమములో శంకర్, టిబి హెచ్ వి, వాసవ్య మహిళా మండలి సిబ్బంది, కె.శ్రీనివాసరావు, ఎజెఆర్ సత్యప్రసాద్, ఎస్.ఆనందరావు, డి.నాగరాజు, పి.సుదర్శన్, డి.వీరాంజనేయులు, ఎం.సాత్విక్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News