Breaking News

ప్రశాంత వాతావరణంలో పాఠశాల యాజమాన్య కమిటీల (SMC) ఎన్నికలు

-రాష్ట్రవ్యాప్తంగా ఉత్సాహంగా, పారదర్శకంగా సాగిన ఎన్నికల ప్రక్రియ
-సమగ్ర శిక్ష స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ బి. శ్రీనివాసరావు, IAS వెల్లడి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన “SMC మార్గదర్శకాలు – 2026” ప్రకారంగా, పాఠశాల విద్యాశాఖ, సమగ్ర శిక్ష సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా పాఠశాల యాజమాన్య కమిటీల (SMC) పునర్వ్యవస్థీకరణ ఎన్నికలు అత్యంత పారదర్శకంగా, విజయవంతంగా ముగిశాయని సమగ్ర శిక్ష స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ బి. శ్రీనివాసరావు, IAS తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాలల పునర్నిర్మాణంలోనూ, మెరుగైన పర్యవేక్షణలోనూ పాఠశాల యాజమాన్య కమిటీల పాత్ర కీలకమైనదని అన్నారు. ఈ ఎన్నికల నిర్వహణలో సహకరించిన ఉపాధ్యాయులకు, అధికారులకు, ప్రజాప్రతినిధులకు, తల్లిదండ్రులకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు.

ప్రశాంతంగా జరిగిన ఎన్నికలు
రాష్ట్రంలోని మొత్తం 44,059 పాఠశాలలు ఉండగా 39,888 పాఠశాలల్లో ఎన్నికలు సజావుగా, ప్రశాంత వాతావరణంలో జరిగాయి. పలు పాఠశాలల్లో గ్రామస్థులు, తల్లిదండ్రుల సమన్వయంతో కమిటీ సభ్యులు, ఛైర్‌పర్సన్, వైస్ ఛైర్‌పర్సన్‌లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ఎన్నికలు జరగనిచోట అక్టోబర్ 1న రీ షెడ్యూల్
4,171 పాఠశాలల్లో వివిధ కారణాల వల్ల ఎన్నికలు జరగలేదని, ఇందులో 321 పాఠశాలల్లో కోరం (Quorum) లేకపోవడం వల్ల ఎన్నికలు నిర్వహించలేకపోయారని తెలిపారు. 3,850 పాఠశాలలకు పరిపాలనా కారణాల దృష్ట్యా ఎన్నికలను 01.10.2026 నాటికి రీ-షెడ్యూల్ (వాయిదా) చేశామని ఎస్పీడీ తెలిపారు. ఈ పాఠశాలల్లో త్వరలోనే తిరిగి ఎన్నికల ప్రక్రియ పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.

ఎన్నికల ప్రక్రియ ఇలా జరిగింది
మంగళవారం ఉదయం 7:00 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ ప్రక్రియ మధ్యాహ్నం 1:00 గంట వరకు కొనసాగింది. మధ్యాహ్నం 1:30 గంటలకు ఛైర్‌పర్సన్, వైస్ ఛైర్‌పర్సన్ ఎన్నిక పూర్తి చేసి, మధ్యాహ్నం 2:00 గంటలకు నూతన SMC సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం నిర్వహించారు. మధ్యాహ్నం 3:00 గంటలకు నూతనంగా ఎన్నికైన SMC కమిటీల మొదటి సమావేశం విజయవంతంగా ముగిసింది. పాఠశాలల్లో నాణ్యమైన విద్య, సమర్థవంతమైన యాజమాన్యం కోసం ఈ పాఠశాల యాజమాన్య కమిటీ (SMC) నిర్వహణ కొనసాగుతుందని ఈ సందర్భంగా ఎస్పీడీ బి. శ్రీనివాసరావు, IAS  వెల్లడించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పట్టాల పంపిణీతో 26వేల పేద కుటుంబాలకు భరోసా

-డబుల్ ఇంజన్ సర్కార్‌తో పేదలకు వందల రెట్ల లబ్ది -ఎన్టీఆర్ జిల్లాలో ఇంటి పట్టాలు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *