విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
8 ఆంధ్రా నావల్ యూనిట్ మరియు 8 ఆంధ్రా ఎయిర్ వింగ్ ఎన్ సి సి యూనిట్లు సంయుక్తంగా “నశా ముక్త్ భారత్ అభియాన్ – వికసిత్ భారత్ కి పహచాన్” అనే థీమ్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఈ కార్యక్రమాన్ని 8 ఆంధ్రా నావల్ యూనిట్ కమాండింగ్ ఆఫీసర్ కమాండర్ సుజీత్ కుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ డైరెక్టరేట్ డెప్యూటీ డైరెక్టర్ జనరల్ ఎయిర్ కమోడోర్ నర్సింగ్ సైలాని మరియు కాకినాడ గ్రూప్ కమాండర్ కల్నల్ రితిన్ మోహన్ అగర్వాల్ గారి పిలుపు మేరకు డ్రగ్స్ పై పోరాటం చేసి డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం కోసం ఐక్యతా స్ఫూర్తితో పోరాటం చేయాలనే స్పూర్తితో ర్యాలీ నిర్వహించినట్లు ఆయన తెలిపారు.
“యువతే దేశ భవిష్యత్తు” అని ఆయన అన్నారు. భావి భారతానికి యువత వారధుల వంటి వారని, ఎన్ సి సి కెడెట్లు ర్యాలీలు, వీధి నాటకాలు, మూకాభినయం ద్వారా డ్రగ్స్ దుష్ప్రభావాలపై సమాజంలో అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు. ఎన్ సి సి కెడెట్లు సిద్ధార్థ కళాశాల సర్కిల్ వద్ద డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 40 మంది ఎన్ సి సి కెడెట్లు పాల్గొన్నారు. ఈ ర్యాలీ సిద్ధార్థ కళాశాల సర్కిల్ నుండి మొగల్ రాజపురం గుహల వరకు కొనసాగింది.
సిద్ధార్థ కళాశాల ఎన్ సి సి అధికారి లెఫ్టినెంట్ వెంకటేష్, మారిస్ స్టెల్లా కళాశాల ఎన్ సి సి అధికారిణి సబ్ లెఫ్టినెంట్ వి. స్వప్న, 8 ఆంధ్రా ఎయిర్ వింగ్ సార్జంట్ అమిత్ సింగ్, సార్జంట్ ఆర్ ఎస్ బిస్తు మరియు 8 ఆంధ్రా నావల్ యూనిట్అధికారులు,సూరజ్ ఎన్ సి సి స్టాఫ్ మరియు పిబి సిద్ధార్థ, మారిస్ స్టెల్లా, ఆంధ్రా లొయోలా కళాశాలల ఎన్ సి సి కెడెట్లు పాల్గొని ర్యాలీని విజయవంతం చేసారు. క్యాడెట్స్ డ్రగ్స్ పై పోరాటం చేస్తామని ప్రతిజ్ఞ చేశారు.
Prajavartha Online Telugu News