Breaking News

“​ఇంద్రకీలాద్రిపై దసరా ఏర్పాట్ల పరిశీలన”

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఇంద్రకీలాద్రిపై జరగనున్న దసరా శరన్నవరాత్రి మహోత్సవాల నేపథ్యంలో మంగళవారం సాయంత్రం దేవస్థాన కార్యనిర్వహణాధికారి శీనా నాయక్ క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించి ఏర్పాట్లను పరిశీలించారు.

​ఇందులో భాగంగా నూతన లడ్డూ పోటు మరియు అన్నదాన భవనాలను ఈవో నిశితంగా తనిఖీ చేశారు. ఉత్సవాల నాటికి చిన్న చిన్న పనులన్నీ పూర్తి చేసి భక్తులకు పూర్తి స్థాయిలోకి అందుబాటులోకి తీసుకురావాలని దేవస్థానం ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.
భక్తులకు అందజేసే ప్రసాదాలు అత్యంత రుచికరంగా, నాణ్యతా ప్రమాణాలతో తయారు కావాలని, అన్నప్రసాద వితరణలో ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని వసతులు సిద్ధం చేయాలని స్పష్టం చేశారు.
​అనంతరం కనకదుర్గ నగర్‌ను సందర్శించి, అక్కడ జరుగుతున్న డ్రైనేజీ వ్యవస్థ ఆధునీకరణ పనులను పరిశీలించారు. పారిశుద్ధ్య లోపాలు తలెత్తకుండా డ్రైనేజీ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని సంబంధిత ఇంజినీరింగ్, పారిశుద్ధ్య అధికారులకు మార్గదర్శనం చేశారు.
​ఈ సందర్భంగా ఈవో శీనా నాయక్ మాట్లాడుతూ… దసరా శరన్నవరాత్రులకు తరలివచ్చే లక్షలాది మంది భక్తుల సౌకర్యార్థం దేవస్థానం అన్ని శాఖలతో సమన్వయం చేసుకుంటూ పనులు వేగవంతం చేస్తోందన్నారు. క్యూలైన్లు, తాగునీరు, పారిశుద్ధ్యం, ప్రసాదాల పంపిణీ వంటి అన్ని విభాగాల్లో ఎక్కడా చిన్న లోపం కూడా రాకుండా సిబ్బంది అంకితభావంతో పనిచేసి ఏర్పాట్లను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు.
​ఈ పర్యటనలో దేవస్థానం కార్యనిర్వాహక ఇంజినీర్, ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పట్టాల పంపిణీతో 26వేల పేద కుటుంబాలకు భరోసా

-డబుల్ ఇంజన్ సర్కార్‌తో పేదలకు వందల రెట్ల లబ్ది -ఎన్టీఆర్ జిల్లాలో ఇంటి పట్టాలు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *