-భోజన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే ఇంటూరి, మాజీ మంత్రి దేవినేని ఉమా
ప్రకాశం జిల్లా, పామూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గం నుండి పల్లె పండుగ కార్యక్రమానికి హాజరయ్యేందుకు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. కందుకూరు పార్టీ శ్రేణుల కోసం పామూరు మండలం రాజూగారి కొట్టాలు గ్రామంలో ఏర్పాటు చేసిన భోజన ఏర్పాట్లను శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పరిశీలించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భోజన వసతి, ఇతర సౌకర్యాలను పరిశీలించి నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. పల్లె పండుగ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కందుకూరు నియోజకవర్గం నుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివస్తుండటంతో ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని సూచించారు. పార్టీ శ్రేణుల సౌకర్యానికి ప్రాధాన్యతనిస్తూ అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని తెలిపారు.
Prajavartha Online Telugu News