విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కవిరాజు త్రిపురనేని రామస్వామి తెనాలి మున్సిపల్ ఛైర్మన్గా ఎన్నికై 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా చైతన్య యాత్రను నిర్వహిస్తున్నట్లు లోక నాయక ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ తెలిపారు. మంగళవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మొదటియాత్ర త్రిపురనేని జన్మస్థలమైన కృష్ణా జిల్లా అంగలూరు నుంచి ఆంధ్ర విశ్వవిద్యాలయ ఆచార్యులు పరిశోధకులతో గుడివాడ (కవిరాజ సాహితీ విహారం, ANR కళాశాల), పెదపారుపూడి, నిమ్మకూరు, ఉయ్యూరు మీదుగా విజయవాడ చేరుకుంటుందని తెలిపారు. రెండో రోజు విజయవాడ తుమ్మలపల్లి వారి కళాక్షేత్రంలో గల కవిరాజు విగ్రహానికి నివాళులర్పించి, గుంటూరు, వడ్లమూడి (విజ్ఞాన్ వర్సిటీ), సంగం జాగర్లమూడి, తెనాలిలోని ఐతానగర్, కవిరాజా పార్క్ మీదుగా ఈ రెండు రోజుల యాత్ర సాగుతుంది తెలిపారు. ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవడం ఏ పని ప్రారంభించినా ఎందుకు అని ప్రశ్నించే అలవాటును నేటి యువత అలవర్చుకోవాలని, వివాహాల్లో ఆడంబర వ్యయాలు తగ్గించడం సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు లేదా ప్రభుత్వ ‘P4’ వంటి కార్యక్రమాలకు కేటాయించి నేటి యువత స్ఫూర్తిగా నీలవాలని, ఈతరం ఆధునిక విద్యను అభ్యసిస్తున్న యువత మూఢనమ్మకాలకు దూరంగా ఉండాలని, సమకాలీన సమాజానికి సాహితీ యాత్రలు, చైతన్య యాత్రలు ఎంతో అవసరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో కవిరాజు మనవడు తత్వవేత్త రచయిత గోపీచంద్ కుమారుడు ప్రసిద్ధ సినిమా నటుడు శ్రీసాయిచంద్ మరియు కృష్ణ, గుంటూరు జిల్లాలలో సాహితీ ప్రముఖులు కౌలు రచయితలు పాల్గొంటారని తెలిపారు. విద్యార్థులు, యువత, ప్రజలు అందరూ స్వచ్ఛందంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి గుమ్మా సాంబశివరావు, గోళ్ళనారాయణరావు, వెన్న వల్లభ రావు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News