విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోయింగ్ సంఘం అధ్యక్షులు డాక్టర్ తరుణ్ కాకాని, ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్. భరణి ఐఎఫ్‌ఎస్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రోయింగ్ ఛాంపియన్‌షిప్ జ్ఞాపికను ఎస్. భరణికి అందజేశారు. అలాగే రాష్ట్రంలో రోయింగ్ క్రీడ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి పలు వినతిపత్రాలను సమర్పించారు. జపాన్‌లో జరిగిన ఆసియా రోయింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత రోయింగ్ జట్టు కాంస్య పతకం సాధించిన విషయాన్ని డాక్టర్ తరుణ్ కాకని వివరించారు. రోయింగ్ క్రీడకు రాష్ట్రంలో మరింత ప్రోత్సాహం అందించి, ప్రతిభావంతులైన క్రీడాకారులను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దాల్సిన అవసరాన్ని ఆయన వివరించారు. అలాగే ఈ ఏడాది డిసెంబర్‌లో పూణేలోని రోయింగ్ కేంద్రంలో ఆసియా రోయింగ్ ఛాంపియన్‌షిప్ పోటీలు తొలిసారిగా భారత్‌లో నిర్వహించనున్నట్లు తెలిపారు.
Prajavartha Online Telugu News