విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆహార భద్రత, పరిశుభ్రతకు సంబంధించి ఇటీవల పలు వార్తాపత్రికల్లో వెలువడిన కథనాల నేపథ్యంలో తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఏపీ రాష్ట్ర విజిలెన్స్ ప్రత్యేక ఆహ్వానితులు, వినియోగదారుల అవగాహన ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ తరుణ్ కాకాని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 20-పాయింట్ల కార్యక్రమ అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఆహార పదార్థాల నాణ్యత, పరిశుభ్రత, ప్రజారోగ్య పరిరక్షణకు సంబంధించి అవసరమైన చర్యలు చేపట్టాలని వారు కోరారు. ఇదిలా ఉండగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన G.O.Ms.No.12 ద్వారా రాష్ట్ర విజిలెన్స్ సభ్యునిగా నియమితులైన బీజేపీ నాయకులు డాక్టర్ తరుణ్ కాకానిని రాష్ట్ర 20-పాయింట్ల కార్యక్రమ అమలు కమిటీ చైర్మన్, బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకులు లంకా దినకర్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ప్రజల ఆరోగ్యం, వినియోగదారుల హక్కుల పరిరక్షణకు సంబంధించి మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని వారు పేర్కొన్నారు.
Prajavartha Online Telugu News