విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ బ్యాక్వార్డ్ క్లాస్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రపంచ మేధావి, రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్.అంబెడ్కర్ 65వ వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఫెడరేషన్ ఛైర్మన్ తమ్మిశెట్టి చక్రవర్తి అంబెడ్కర్ చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగానికి ప్రాణం పోసిన అపరమేధావని, అసమానతలు లేని సమాజం కోసం అనునిత్యం పరితపించి బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం పాటుపడిన మహా నేత అని గుర్తు చేశారు. నేడు ఆ మహానుభావుడు రచించిన రాజ్యాగానికి అగౌరపరిచేలా కొందరు రాజకీయ నాయకులు ప్రవర్తిస్తున్నారని దానిని కాపాడుకోవాల్చిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిడబ్ల్యూడీ గ్రౌండ్లో అంబెడ్కర్ స్ముతివనము ని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని త్వరగా పూర్తిచేసి చిత్తశుద్ధి నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు వేముల శ్రీనివాసరావు, కృష్ణా జిల్లా మహిళా అధ్యక్షురాలు మోర్ల లక్ష్మి, విజయవాడ మహిళా అధ్యక్షురాలు దామర్ల సాంబ్రాజ్యం, స్థానిక మహిళలు కొటేశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు
Tags vijayawada
Check Also
డిల్లీలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి పర్యటన
-రవాణా వ్యవస్థపై క్షేత్ర స్థాయిలో సమీక్షా -రోడ్డు భద్రతా విధి విధానాలపై మంత్రి పరిశీలన -తెలంగాణ రవాణా శాఖ మంత్రి …