Breaking News

బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణపై ఆసుపత్రులకు అవగాహన

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు బుధవారం మధ్యాహ్నం గవర్నర్‌పేటలోని మెడికల్ అసోసియేషన్ హాల్‌లో నగరంలోని ఆసుపత్రుల యాజమాన్యాలకు బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణపై సేఫ్ ఎన్విరాన్‌మెంట్ ఏజెన్సీ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగరంలోని 200కు పైగా ఆసుపత్రుల యాజమాన్యాలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ గోపాల నాయక్ మాట్లాడుతూ ఆసుపత్రుల్లో బయోమెడికల్ వ్యర్థాలను నిబంధనల ప్రకారం వేర్వేరుగా సేకరించి, నిర్వహించాలని సూచించారు. ఇందుకోసం పసుపు, ఎరుపు, నీలం, నలుపు రంగుల చెత్తబుట్టలను ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. పసుపు రంగు బిన్‌లో శరీర అవయవాలు తదితర బయోమెడికల్ వ్యర్థాలు, ఎరుపు రంగు బిన్‌లో ప్లాస్టిక్ వ్యర్థాలు, సిరంజీలు తదితర వ్యర్థాలు, నీలం రంగు బిన్‌లో గాజు మరియు సంబంధిత వ్యర్థాలు, నలుపు రంగు బిన్‌లో సాధారణ వ్యర్థాలను వేరు చేయాలని సూచించారు. నలుపు రంగు బిన్‌లోని సాధారణ వ్యర్థాలను కూడా విజయవాడ నగరపాలక సంస్థకు అందించే ముందు తడి, పొడి వ్యర్థాలుగా వేరు చేసి అందించాలని అవగాహన కల్పించారు.

కార్యక్రమంలో ఏపీ కాలుష్య నియంత్రణ మండలి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పి. శ్రీనివాసరావు, ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ వేమూరి నాగ వరప్రసాద్, ఐఎంఏ కార్యదర్శి డాక్టర్ టి. అనిరూప్, సేఫ్ ఎన్విరాన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ వి. వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పట్టాల పంపిణీతో 26వేల పేద కుటుంబాలకు భరోసా

-డబుల్ ఇంజన్ సర్కార్‌తో పేదలకు వందల రెట్ల లబ్ది -ఎన్టీఆర్ జిల్లాలో ఇంటి పట్టాలు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *