Breaking News

నార్కోటిక్ డ్రగ్స్ నిల్వ భవన నిర్మాణాన్ని పరిశీలించిన కలెక్టర్ డీకే బాలాజి

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో పోలీసులు స్వాధీనం చేసుకునే డ్రగ్స్ ను భద్రంగా నిల్వ చేసేందుకు స్థానిక పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ వెనుక భాగంలో నూతనంగా నిర్మిస్తున్న నార్కోటిక్ డ్రగ్స్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (ఎన్డిపిఎస్) భవన నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ డీకే బాలాజి బుధవారం పరిశీలించారు. భవన నిర్మాణ పనుల పురోగతిని సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్న కలెక్టర్, నిర్మాణ పనులు, భద్రతా ప్రమాణాలు, స్ట్రాంగ్ రూమ్ ఏర్పాట్లను పరిశీలించారు. నిర్మాణ పనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. కలెక్టర్ వెంట రహదారులు భవనాల శాఖ కార్యనిర్వహక అధికారి లోకేశ్వరరావు, స్పెషల్ బ్రాంచ్ సిఐ సత్య కిషోర్ తదితరులు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పట్టాల పంపిణీతో 26వేల పేద కుటుంబాలకు భరోసా

-డబుల్ ఇంజన్ సర్కార్‌తో పేదలకు వందల రెట్ల లబ్ది -ఎన్టీఆర్ జిల్లాలో ఇంటి పట్టాలు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *