-తెలుగు సాహిత్య వికాసానికి విశేష సేవలు అందించిన చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ (సి.పి. బ్రౌన్) జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన మంత్రి దుర్గేష్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
తెలుగు సాహిత్య వికాసానికి విశేష సేవలు అందించిన చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ (సి.పి. బ్రౌన్) జయంతి సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ ఘన నివాళులు అర్పించారు.. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ.. విదేశీయుడైనప్పటికీ తెలుగును మాతృభాషగా ప్రేమించి, దాని వ్యాప్తికి బ్రౌన్ తన జీవితాన్ని అంకితం చేశారని కొనియాడారు. తెలుగులో తొలి ప్రామాణిక నిఘంటువును రూపొందించి, నేటికీ ప్రామాణికంగా నిలిచేలా చేసిన మహనీయుడు బ్రౌన్.ప్రాచీన తెలుగు కావ్యాలను సేకరించి వాటిని భావితరాలకు దానం చేసిన “సాహితీ కర్ణుడు” ఆయన. సి.పి. బ్రౌన్ చూపిన బాటలో మన మాతృభాష తెలుగు గొప్పదనాన్ని, దాని సాహితీ సంపదను పరిరక్షించుకోవడమే ఆయనకు మనం ఇచ్చే నిజమైన నివాళి అని మంత్రి దుర్గేష్ ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు.
