-తుఫాన్ బాధిత రైతులకు అండగా నిలిచేందుకు కామన్ గుడ్ ఫండ్ నుంచి ఆర్థిక సాయం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
తుఫాన్ల కారణంగా పంటలు నష్టపోయిన రైతులకు అండగా నిలిచేందుకు కృష్ణా డిస్ట్రిక్ట్ కో ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ (కేడీసీసీ బ్యాంక్) ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.1 కోటి విరాళం అందించింది. ఈ మేరకు బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురాం, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును సచివాలయంలో కలిసి రూ.1 కోటి చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర, ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నెట్టెం రఘురాం మాట్లాడుతూ, తుఫాన్ల ప్రభావంతో పంటలు నష్టపోయిన రైతులకు ఆర్థికంగా అండగా నిలవాలనే ఉద్దేశంతో కేడీసీసీ బ్యాంక్ కామన్ గుడ్ ఫండ్ నుంచి ఈ విరాళాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళం అందించడం తమ బాధ్యతగా భావిస్తున్నామని పేర్కొన్నారు. రైతులకు అండగా నిలిచేందుకు కేడీసీసీ బ్యాంక్ ముందుకు వచ్చి ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.1 కోటి విరాళం అందించడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు తెలిపారు.
