ప్రజలందరి సహకారంతోనే ఘన విజయం సాధించాం : లక్ష్మీ అపర్ణ కోవెలమూడి

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త:
నగర మేయర్ అభ్యర్థిగా ఘన విజయం సాధించడంలో నగర ప్రజలందరి పాత్ర ఎంతో ఉందని లక్ష్మీ అపర్ణ కోవెలమూడి అన్నారు. బుధవారం ఆమె కొరటిపాడు పార్కులోని వాకింగ్ ట్రాక్‌పై వ్యాయామం చేస్తున్న వారితో కలిసి నడుస్తూ ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తన విజయానికి సహకరించిన నగర ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేసేందుకే వారిని కలుసుకోవడానికి వచ్చానని తెలిపారు. ప్రజల ఆదరాభిమానాలు, సహకారం మరువలేనివని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆమె వెంట కార్పొరేటర్లు కొమ్మినేని కోటేశ్వరరావు, ఎలుక ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.