కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
మన మండలం/గ్రామ అభివృద్ధి కోసం లక్ష్యం నిర్దేశించుని ఎంపిటిసి లు సమన్వయం తో పని చెయ్యాలని మాస్టర్ ట్రైనర్(MoT) చాగల్లు- ఎంపీడీఓ పి., బి.రాంప్రసాద్ పేర్కొన్నారు. కొవ్వూరు నియోజకవర్గ పరిధిలోని 3 మండలాల ఎంపీటీసీ సభ్యులకు రెండవ రోజు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా రాం ప్రసాద్ మాట్లాడుతూ, రాజ్యాంగ కల్పించిన హక్కులు ద్వారా మండల, గ్రామ అభివృద్ధి లో ప్రతి ఒక్కరూ వారి విలువైన సూచనలు, సలహాలు అందించాల్సి ఉందన్నారు. లక్ష్యం నిర్దేశించుకుంటే కొన్ని పనుల్లో ఆలస్యం జరగ వొచ్చు కానీ ఫలితం తప్పకుండా వుంటుందన్నారు. ఎంపీటీసీ సభ్యులకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల పథకాలు పై అవగాహన కల్పించారు. శిక్షణలో మండల పరిషత్ యొక్క ఆర్థిక వ్యవహారాలు, ప్రభుత్వ పథకాలు,ప్రణాళికలు, పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం గురించి వివరించారు. గౌరవ ఎంపిటిసిలు అడిగిన పలు సందేహాలను నివృత్తి చేసారు. శిక్షణ అనంతరం శిక్షణ కి హాజరైన ఎంపిటిసి లకు ధ్రువపత్రాలు అందచేశారు. ఈ శిక్షణ కార్యక్రమంలో అసిస్టెంట్ ప్రాజెక్టు ఆఫీసర్ కెవివి సత్యనారాయణ , ఇంచార్జి ఈవో పిఆర్డీ కె. మెస్సేయ్య రాజు, కొవ్వూరు, చాగల్లు, తాళ్లపూడి మండలాల ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు.
Tags kovvuru
Check Also
ఏపీలో సినీ పరిశ్రమను ప్రోత్సహిస్తాం
-చిత్ర పరిశ్రమ కోసం కొత్త ఫిల్మ్ పాలసీని తీసుకొస్తాం -గేమ్ ఛేంజర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో వెల్లడించిన రాష్ట్ర …