సీఎం చంద్రబాబును కలిసిన మాజీ క్రికెటర్ జాంటీ రోడ్స్

-భోగాపురం సమీపంలోని ముక్కం బీచ్‌లో రూ.55 కోట్లతో వెల్‌నెస్ సెంటర్ ఏర్పాటు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
దక్షిణాఫ్రికాకు చెందిన ప్రముఖ మాజీ క్రికెటర్ జాంటీ రోడ్స్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిశారు. విశాఖపట్నంలో నిర్వహిస్తున్న భాగస్వామ్య సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన ఆయన ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నారు. భోగాపురం విమానాశ్రయం సమీపంలో ఏర్పాటు చేయనున్న ముక్కం కోస్టల్ వెల్‌నెస్, సర్ఫ్ క్లబ్‌కు జాంటీ రోడ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నారు. ఈ సంస్థ భోగాపురం సమీపంలోని ముక్కం బీచ్‌లో సుమారు రూ.55 కోట్ల పెట్టుబడితో వెల్‌నెస్ సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది.