లబ్ధిదారులకు ఎల్ ఓ సీ లు అందజేత

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
ఎమ్మెల్యే సుజనా చౌదరి చొరవతో ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం లబ్ధిదారులకు మంజూరైన ఎల్ఓసి పత్రాలను భవానిపురం ,ఎన్డీయే కార్యాలయంలో కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ కూటమి నేతలతో కలిసి లబ్ధిదారుల కుటుంబ సభ్యులకు అందజేశారు. 55 వ డివిజన్, రాజరాజేశ్వరి పేటకు చెందిన అబ్దుల్ రహీం (47) బ్రెయిన్ స్ట్రోక్ కి గురై అత్యవసర వైద్యం కోసం దరఖాస్తు చేసుకోగా మంజూరైన రూ 5.10 లక్షల విలువైన ఎల్ ఓ సీ ను అందజేశారు. 45 వ డివిజన్ చిట్టి నగర్ కు చెందిన షేక్ ఆషియా ( 41) గాల్ బ్లాడర్ స్టోన్స్ తో బాధపడుతూ వైద్య సాయం కోసం దరఖాస్తు చేసుకోగా మంజూరైన రూ 1.95 లక్షల విలువైన ఎల్ ఓ సీ ను అందజేశారు

త్వరితగతిన స్పందించి ఎల్ ఓ సీ ను అందజేసిన ఎమ్మెల్యే సుజనా చౌదరి కు బాధితుల కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా బీజేపీ వైస్ ప్రెసిడెంట్ నున్న కృష్ణ, కూటమి నాయకులు దాడి అప్పారావు,దేవిన హరి ప్రసాద్, వేవిన నాగరాజు, పెద్దిన శ్యామ్ సుందర్, కే శేషారావు, గాలేటి లక్ష్మణరావు, తదితరులు పాల్గొన్నారు.