-ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశ ఆర్థిక ప్రగతికి అద్దం పడుతున్న స్టాక్ మార్కెట్
-ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
భారత స్టాక్ మార్కెట్లో సెన్సెక్స్ కేవలం 23 ట్రేడింగ్ సెషన్లలోనే 10 వేల పాయింట్లకు పైగా పెరుగుదల నమోదు చేయడం విశేషమని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పేర్కొన్నారు. భారత ఆర్థిక వ్యవస్థపై దేశీయ, అంతర్జాతీయ పెట్టుబడిదారుల్లో పెరుగుతున్న విశ్వాసానికి ఈ పరిణామం ప్రతిబింబమని ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ ఆర్థికంగా ముందుకు సాగుతున్న నేపథ్యంలో స్టాక్ మార్కెట్లో నమోదవుతున్న ఈ వృద్ధి దేశ ఆర్థిక వ్యవస్థపై పెట్టుబడిదారుల అంచనాలను తెలియజేస్తోందని పేర్కొన్నారు. ఆర్థిక సంస్కరణలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, పారిశ్రామిక రంగ విస్తరణ, పెట్టుబడులకు అనుకూలమైన విధానాలు దేశ ఆర్థిక కార్యకలాపాలకు ఊతమిస్తున్నాయని తెలిపారు.
భారత్ ప్రపంచ ఆర్థిక వేదికపై కీలక పాత్ర పోషిస్తున్న తరుణంలో స్టాక్ మార్కెట్లో నమోదవుతున్న రికార్డులు దేశ ఆర్థిక రంగంలో చోటుచేసుకుంటున్న మార్పులను సూచిస్తున్నాయని పీవీఎన్ మాధవ్ పేర్కొన్నారు. దేశ అభివృద్ధిలో పెట్టుబడిదారుల విశ్వాసం, పారిశ్రామికవేత్తల భాగస్వామ్యం, ప్రజల ఆర్థిక ఆకాంక్షలు కీలకమని ఆయన తెలిపారు.
భారతదేశం అభివృద్ధి పథంలో మరింత ముందుకు సాగాలని, దేశ ఆర్థిక ప్రగతి ప్రతి సామాన్యుడి జీవితంలోనూ సానుకూల మార్పులు తీసుకురావాలని ఆకాంక్షించారు.
