-గోపాలపురం మండలం లోని గ్రామాలకు 24 చెత్త సేకరణ రిక్షాల పంపిణీ
-కలెక్టర్ డా. కే.మాధవీలత
-ఎమ్ ఎల్ ఏ తలారి వెంకట్రావు
గోపాలపురం, నేటి పత్రిక ప్రజావార్త :
జగనన్న స్వచ్చ సంకల్ప కార్యక్రమాన్ని విజయవంతం చెయ్యడంలో ప్రజలు భాగస్వామ్యం అవ్వాలని కలెక్టర్ డా. కే.మాధవీలత , శాసనసభ్యులు తలారి వెంకట్రావు లు విజ్ఞప్తి చేశారు. సోమవారం స్థానిక మండలాభివృద్ది అధికారి కార్యాలయం వద్ద నిర్వహించిన నియోజకవర్గ స్థాయి స్పందన కార్యక్రమం అనంతరం శాసనసభ్యులు తలారి వెంకట్రావు తో కలిసి కలెక్టర్ మాధవిలత 24 చెత్త సేకరణ రిక్షాలనను గ్రామ పంచాయతీలకు అందచేశారు. ఈ సందర్భంగా శాసన సభ్యులు తలారి వెంకట్రావు మాట్లాడుతూ, గోపాలపురం మండలంలో ఉన్న అన్ని గ్రామ పంచాయతీలకు ఇంటి ఇంటి నుండి చెత్త సేకరణకు రీక్షాలను పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఇంటింటికీ వచ్చే పారిశుద్ధ్య కార్మికులకు పొడి చెత్త తడిచెత్త విడివిడిగా అంద చేయాలన్నారు. మన గ్రామం పరిశుభ్రంగా ఉంచుకోవాలని, అందువలన మనం, మన గ్రామం అనారోగ్యం బారిన పడకుండా కాపాడుకో గలుగుతాం అన్నారు. దోమలు నివారణకు, స్వచ్ఛ గ్రామంగా తీర్చిదిద్దడం లో ప్రతి ఒక్కరి చేయూత ను కోరుతున్నట్టు తెలిపారు.
జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత మాట్లాడుతూ, మనం మన పరిసరాల్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా ఆరోగ్యవంతమైన సమాజాన్ని స్థాపించ గలమన్నారు. తద్వారా చెత్త నుంచి సంపద సృష్టించ గలుగుతామన్నారు. తడి చెత్త, పొడి చెత్త, వైద్య వ్యర్ధాలను విడివిడిగా ఇంటి వద్దకు వచ్చే వారికి ఇచ్చి సహకారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అధ్యక్షులు శ్రీ ఉండవల్లి సత్యనారాయణ,గోపాలపురం జెడ్పిటిసి సభ్యులు శ్రీమతి కాకులపాటి లలిత, పలువురు జిల్లా స్థాయి అధికారులు, గోపాలపురం ఎంపీడీవో,ఆర్. శ్రీదేవి, తాహసిల్దార్, జి.రత్నమణి తదితరులు పాల్గొన్నారు.