రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
బుధవారం ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహించే వీడియో కాన్ఫరెన్స్ కు అధికారులు పూర్తి సన్నద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కె మాధవి లత ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ ఛాంబర్లో జిల్లా, డివిజన్ అధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమం తో పాటు అభివృద్ధి కూడా ఎంతో ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. విశాఖ ప్రతి శాఖ వారికి నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేసేందుకు నిర్దిష్టమైన కార్యాచరణ అమలు చేయాలన్నారు క్షేత్రస్థాయిలో తగినంత మానవ వనరులు అందుబాటులో ఉండడం వల్ల లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయగలరు రమ్మన్నారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ పనులు, లేబర్ బడ్జెట్, రైతు భరోసా కేంద్రాలు, సచివాలయాలు, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ రూరల్, ఏ ఎన్ సి యు, బి ఎం సి యు, వైఎస్ఆర్ డిజిటల్ లైబ్రరీ భావముల భవనాల పురోగతిపై కలెక్టర్ సమీక్షించారు. ఆయా పనులను పురోగతి చూపాలని, ముఖ్యమంత్రి భవనాల పనులను వేగవంతం చేసి నిర్మాణాలు పూర్తి చేయాలని స్పష్టం చేస్తున్నారన్నారు. హౌసింగ్, జగనన్న భూహక్కు, భూరక్ష పథకం, స్పందన ఫిర్యాదులు, ఖరీఫ్ 2022 కార్యాచరణ ప్రణాళిక, జాతీయ రహదారులు ఇరిగేషన్ కు సంబంధించిన భూసేకరణ అంశాలపై కలెక్టర్ శాఖలవారీగా సమీక్షించారు.
Tags rajamendri
Check Also
దాడి పూర్ణిమను ఆశీర్వదించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ దాడి అప్పారావు మనవరాలు, తెలుగు యువత నాయకులు …