తల్లిదండ్రులను ఇద్దరినీ కోల్పోయిన పిల్లలకు 10 లక్షల రూపాయల చొప్పున చేయూత…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
పి ఎం కేర్ పథకం లో భాగంగా కోవిడ్ సమయంలో తల్లిదండ్రులను ఇద్దరినీ కోల్పోయిన పిల్లలకు 10 లక్షల రూపాయల చొప్పున చేయూతను అందించడం జరిగిందని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ పేర్కొన్నారు.

మంగళవారం రాజమహెంద్రవరంలో జరిగిన ఆజాదీ క అమృత్ మహోత్సవం వేడుకల్లో బాధిత కుటుంబాలకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తూర్పు గోదావరి జిల్లాకు చెందిన దేవరపల్లి కి చెందిన పల్లంట్ల హేమంత్ కుమార్ కు, ధవలేశ్వరం కు చెందిన అంకం భార్గవ సూర్య హర్షవర్ధన్ లకు చెక్కులు అందించామన్నారు. జిల్లాలో మొత్తం తొమ్మిది మంది కి పి ఎం కేర్ పథకం ద్వారా భద్రత కల్పించడం జరిగిందన్నారు. ఏడుబాధిత కుటుంబాలకు చెందిన వారు ఉండగా వీరిలో ఏడుగురు బాలురు, ఇద్దరు బాలికలు ఉన్నారని అధికారులు తెలియచేశారు. ఎస్సీలు ఐదుగురు, బిసి ఒకరు, ఇతరులు ముగ్గురు ఉన్నారని తెలిపారు. ఈ ప్రయోజనం 24.03.2020 నుండి అమలులోకి వస్తుందనీ మరియు 24.03.2022 వరకు అటువంటి కేసులన్నింటికీ పునరాలోచనలో అందుబాటులో ఉంచామని తెలిపారు.

ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం కోవిడ్ కారణంగా మరణించిన వారి కుటుంబాలకు పింఛను అందజేస్తుందని మరియు బీమా పరిహారాన్ని మెరుగుపరచడం మరియు సరళీకృతం చేయడం కోవిడ్-19 కారణంగా తల్లిదండ్రులను లేదా సంరక్షకులను కోల్పోయిన పిల్లలకు మద్దతు ఇవ్వడానికి అనేక చర్యలను ప్రారంభించడంతో పాటు, మహమ్మారి కారణంగా సంపాదించే సభ్యుడిని కోల్పోయిన కుటుంబాలకు సహాయం చేయడానికి కేంద్రం మరిన్ని చర్యలను ప్రకటించిందని పేర్కొన్నారు. ఏడాదికి రూ.20 వేలు చొప్పున విద్య పూర్తి చేసే వరకు ఆర్థిక సహాయం, ఆరోగ్యశ్రీ ద్వారా పిల్లలు పేరున ఐదు లక్షల ప్రీమియం ఇన్సూరెన్స్ కూడా చెయ్యడం జరుగుతుందని తెలిపారు.

కార్యక్రమంలో జిల్లా ఇంఛార్జి మంత్రి సిహెచ్. వేణుగోపాల కృష్ణ, ఎంపి ఎమ్. భరత్ రామ్, ఎమ్ ఎల్ ఏ జక్కంపూడి రాజా , జిల్లా కలెక్టర్ కె మాధవిలత, రుడాచైర్పర్సన్ ఎం . షర్మిలారెడ్డి, ప్రజా ప్రతినిదులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *